Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50  |  Sobhan's Solo Songs  |  Sobhan's Duets

Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment  
Ishwar

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 11,012
Reply with quote  #1 

యుద్ధం గెలవడంలో మన ఇతిహాసాలలో పాటించిన ధర్మాలు, నియమాలు ఎలా అయితే

ఎంత కీలకమో అలాగే ఇక్కడ జూస్ లా అంత ప్రాముఖ్యతను సంతరించుకుంది.
అతిథి దేవో భవ, అతిథి అభ్యాగతులకు పెట్టనిదే తినకూడదు ఎందుకంటే సాక్షాత్తు ఆ నారాయణుడే ఇంటికి అతిథి రూపంలో వస్తాడు అన్న భావాలకు దగ్గరగా ఉన్న గ్రీక్ ఫిలాసఫీ చుట్టూ కథ నడిపి తాత్త్వికంగా ఎన్నో శిఖరాలను టచ్ చేస్తూ వెళ్ళాడు.
బ్రహ్మ కమలం పై కూర్చుని సృష్టి రచన చేసాడు.
కమలం విచ్చుకున్న జ్ఞానానికి ప్రతీక. మన ఋషులు ప్రతీకాత్మకంగా సత్యాన్ని ఆవిష్కరించడానికి ఎక్కువగా ఇష్టపడతారు.
అలా ఈ చిత్రంలో కాలిప్సో ద్వారా లోటస్ ని తినిపించడం వెనుక ఉన్న ఉద్దేశ్యం పూర్తిగా కమలంలా విచ్చుకునే తన జ్ఞానాన్ని అడ్డుకట్ట వేసి తనను బందీగా ఉంచుకోవడం.
ఇది కథకు చాలా కీలకమైన ఘట్టం. ఎందుకంటే అల్టిమేట్ గా ఎవరు ఏ యుద్ధం చేసినా ఆశించేది భౌతికమైన సుఖాలనే. భౌతికవాదానికి ఉన్న పెద్ద ప్లస్, మైనస్ ఇదే. సుఖం ఎప్పుడూ శాశ్వతం కాదన్నది తెలుస్తూనే ఉన్నా సరే పదే పదే మనిషి కోరుకుంటాడు. సరిగ్గా అక్కడే ఏదో ఒక ట్రాప్ ఉంటుంది.

ట్రోజన్ హార్స్ లో సైన్యాన్ని దాచి ఒక గిఫ్ట్ లాగా చేరుకొని ట్రాయ్ పై విజయం సాధించాక అంటే ఆ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేసే క్రమంలోనే ఒడిసియస్ కు అర్థం అయిపోయింది తాను కేవలం మనుషుల్ని కాదు ఒక నమ్మకాన్ని ఒక సివిలైజేషన్ ని పూర్తిగా చంపుతున్నాను అని.
దాని తాలూకు పరిణామాలే తన జర్నీలో అతను ఎదుర్కున్న కష్టాలు.
ఒంటి కన్ను సైక్లాప్స్ ఇక్కడ వారి వన్ సైటేడ్ నేచర్ కు ప్రతీక.
తన గుహలో గొర్రెలు ఒక రకంగా ట్రోజన్ హార్స్ లో వారు అంతకాలం బ్రతికిన వారి జీవన శైలినే గుర్తు చేస్తున్నాయి.
గేట్ లు తెరుచుకున్న తర్వాత పదేళ్ల మా క్రోధం ఒక్క సారిగా ఆ ప్రజలపై విరుచుకుపడ్డట్టు నాకు అనిపించింది అని చివర్లో బాధపడుతూ చెబుతాడు.
యుద్ధంలో జరిగేది అదే. యుద్ధంలో విజయ కాంక్ష కోసం ఎన్నింటినో త్యాగం చేస్తారు.
చాలా సార్లు జరిగేది ఏంటి అంటే ఇంద్రియాలను సప్ప్రెస్ చేసి బలవంతంగా అణచుకుని యుద్ధాన్ని జయించాలి అనుకోవడం. అగమేమ్ నాన్ కూతురిని బలి ఇవ్వడం హేయమైన చర్యగా అతనికి అనిపించకపోవడానికి కారణం గెలుపు కాంక్ష అతన్ని అంతగా బ్లైండ్ చెయ్యడమే.
సైక్లాప్స్ నుండి తప్పించుకుని వెళ్ళేటప్పుడు కూడా తిరిగి ఒడిసియస్ బాణం వెయ్యడం ఇంకా అతనిలో మిగిలి ఉన్న బలమైన యుద్ధ గర్వం అహం తాలూకు ప్రతిబింబాలు.
నేను ఎవ్వరిని అయినా గెలవగలను - అహం.
నేను నా పై వచ్చిన శత్రువులతో మాత్రమే యుద్ధం చేస్తాను - క్షాత్ర ధర్మం.
అహంతో యుద్ధాలు గెలవనైతే గెలుస్తారేమో కానీ దాని పరిణామాలు, కాస్ట్ అఫ్ ఫెయిల్యూర్ తరువాత భారీగా అనుభవించి తీరాలి అన్న అద్భుతమైన పాయింట్ కు సెల్ల్యులాయిడ్ రూపమే ఈ చిత్రం. అందుకే నాకు చాలా బాగా నచ్చింది.
ఇందులో ప్రతీకాత్మక వాదానికి పరాకాష్టగా నిలిచిన సర్సి ఎపిసోడ్ చాలా నచ్చింది.
ముఖ్యంగా వారిని పందుల నుండి మనుషులుగా మార్చే ముందు, "మీ మీ ముసుగులు మళ్ళీ ధరించండి" అనడం మాస్టర్ స్ట్రోక్. అంటే పేరుకు మనుషులుగా ఉన్నా బ్రతికే బ్రతుకు అంతా అలాంటి ప్రైమల్ ఇన్స్టింక్ట్ తోనే బ్రతికితే ఎప్పటికీ వారికి మానవీయ కోణం అర్థం కాదు బయట పడదు అని చెప్పడం అద్భుతమైన అబ్సెర్వేషన్.
సైరెన్ సాంగ్స్ వింటూ మాట్ డామన్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అద్భుతం.
అంటే యోధులకు లైబ్రరీలు ఉండవు కదా. వాళ్ళు చాలా రాజసిక, తామసిక మత్తులో ఉండిపోతారు. అలాంటి యోధుడు ఒక సాహిత్యానికి, కవిత్వానికి కరిగిపోతే వాడిలో ఉన్న సత్త్వ గుణం ఒక్కసారిగా మేల్కొని ఎంతలా క్షోభ పడతాడు గతంలో చేసిన తప్పులకు లేదా నెరవేర్చని వాగ్దానాలకు అన్న పెయిన్ భలే పలికించాడు ఆ సన్నివేశంలో.
ఇలాంటి చాలా హ్యూమనిస్ట్ కోణాలను ఒక కావ్యంలా తీర్చిదిద్దిన పాయింట్ అఫ్ వ్యూ ముఖ్యంగా చాలా నచ్చి సినిమా గురించి ఇంత రాసేలా చేసింది.
ఇవన్నీ మీకు తెలియవు అని కాదు. కానీ ఇంతలా విషువల్ ఇంపాక్ట్ క్రియేట్ చెయ్యడం మాత్రం అభినందనీయం అన్న భావంతో ఇక్కడ పంచుకుంటున్నాను సినీ, సాహిత్య అభిమానిగా.
చూడకపోతే తప్పక వెండితెర పై చూడండి.

Adaviramudu

Maharaaju
Registered:
Posts: 18,759
Reply with quote  #2 
Superb 👌
Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.