Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets


Sbdb pays Homage to Sri Akkineni NageswaraRao garu !

Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment  
sreek

Super Moderators
Registered:
Posts: 49,871
Reply with quote  #1 
sreek

Super Moderators
Registered:
Posts: 49,871
Reply with quote  #2 
janasena-in-muncipal-elections-pros-and-cons

ఏలూరు లో ఓటరుగా నమోదు చేయించుకోవాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకోవడం తో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం వేడెక్కింది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో, జనసేనను  పోటీలోకి దించే ఉద్దేశ్యంతోనే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారని కొందరు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలలో ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిలో ముఖ్యంగా వైజాగ్, తిరుపతి, కాకినాడ లాంటి ప్రముఖ నగరాలు కూడా ఉన్నాయి. ఈ నగరాల్లో జరిగే ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా, ఎన్నికల శంఖారావం పూరించాలని పవన్ పై వత్తిడి వస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే లాభం ఏంటి, చేయకపోతే నష్టం ఏంటి అని ఒక్కసారి విశ్లేషిస్తే.. 

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ  చేసి, తెదేపా, వైకాపా లకన్నా ఎక్కువ స్థానాల్లో గెలిస్తే, జనసేన తిరుగులేని రాజకీయ శక్తిగా 2019 ఎన్నికలకి వెళ్ళొచ్చు. అయితే ఇది అంత ఈజీ కాదు. జనసేన కి అభిమానుల బలమే కానీ, కార్యకర్తల బలమింకా సమకూరలేదు. పవన్ అభిమానులు పవన్ ర్యాలీలని, బహిరంగసభల్ని విజయవంతం చేయడానికి పనికొస్తారు. ఎన్నికలు అంటే అంతకుమించి చెయ్యాలి. అభ్యర్థుల ఎంపిక నుంచి బూత్ మేనేజ్మెంట్ దాకా బోలెడంత పొలిటికల్ యాక్టివిటీ ఉంటుంది. ఇది చేయడానికి జనసేన లో ప్రస్తుతం రాష్ట్ర నాయకత్వ బృందమే ఏర్పాటు కాలేదు. అది జరిగి, జిల్లాలు వార్డుల వారీగా కమిటీలు వేయాలంటే అది పెద్ద పని. అలకలు, బుజ్జగింపులు, బహిష్కరణలు, ఆరోపణలు ఇలా బోలెడు ఉంటాయి. పవన్ ఇప్పుడు సినిమాలు మానేసి కూర్చుంటే కాని, ఈ పనులు పూర్తికావు. 

ఇక పొత్తుల విషయానికి వస్తే, పవన్ ఎన్డీయే నుండి బయటకు వచ్చారో లేదో తెలియదు. తెదేపా, బిజెపి లతో పొత్తు కటీఫ్ చేసుకుంటే కానీ, మున్సిపల్ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేయలేరు. పొత్తు కటీఫ్ చేసుకుంటే ఇప్పటినుంచే తెదేపా, బిజెపి లకి వ్యతిరేకంగా పోరాటం చెయ్యాల్సి ఉంటుంది. అలా పోరాటం చేయకుండా ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే అధికారం కోసం పవన్ విడిపోయారు అంటారు. 

సరే ఇవన్నీ ఎప్పుడూ ఉండేవే, ఎన్నికల్లో పోటీ చేస్తే సత్తా తెలుస్తుంది కదా అనుకుంటే..పోటీ చేయవచ్చు.  మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే, జనసేన కు ఊపు వస్తుంది. తెదేపా కి ప్రత్యామ్నాయం  జనసేనే అని జనం ఫిక్స్ అవుతారు. అప్పుడు, జనసేన లోకి వలసలు మొదలవుతాయి. 2019 ఎన్నికల్లో ఎలాగూ గెలుస్తాం అనే ధీమాతో పార్టీలో గ్రూపులు పెరుగుతాయి. పవన్ లాంటి షార్ట్ టెంపర్ మనిషికి ఈ గ్రూపు రాజకీయాలు విరక్తి పుట్టించే ప్రమాదం లేకపోలేదు.

ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోతే, జనసేన కి ఫ్యాన్స్ బలమే కానీ, జన బలం లేదు అని ప్రచారం చేస్తారు. వైకాపా గనుక ఎక్కువ స్థానాల్లో గెలిస్తే తెదేపా కి ప్రత్యామ్నాయం వైకాపా నే, జనసేన కు అంత సీన్ లేదు అని విమర్శిస్తారు. ఇవి, 2019 అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయి. 

పవన్ కనుక, నిజంగా దీర్ఘకాలిక వ్యూహం తో ఉంటే, ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడం మంచిది. అయితే, పోటీ చేసి వీలయినన్ని ఎక్కువ స్థానాల్లో ఓడిపోతే అది జనసేన కి మంచి చేస్తుంది. మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతే, పవన్ క్రేజ్ ని సొమ్ము చేసుకుని ఎమ్మెల్యేలయిపోదాం అని ఆశపడే అవకాశవాదులు వేరే పార్టీ చూసుకుంటారు. అప్పుడు పవన్ కి నిజంగా తనకోసం నిలబడే వారెవరో తెలిసిపోతుంది. తొలి ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీని పునాది స్థాయి నుంచి నిర్మించడానికి ఓపిక ఉన్నవాళ్ళే పవన్ తో ఉంటారు. గాలివాటం గాళ్ళు వెళ్ళిపోతారు.  అది పార్టీకి దీర్ఘకాలం లో మేలు చేస్తుంది. కాబట్టి జనసేన మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడమే మంచిది.

PawanManiaX

The Gabbar
Registered:
Posts: 10,496
Reply with quote  #3 

Good one!
yardstick

Sachin Tendulkar
Registered:
Posts: 52,618
Reply with quote  #4 
In Nutshell emantadu ? 

TDP to pottu vuntunda vundada ? Adi cheppandi mundu
Kondaveeti_Simham

Maharaaju
Registered:
Posts: 20,970
Reply with quote  #5 
okaritho pani emundi meeru emanukuntunnaro cheppandi k nageswar garu media world lo kcr ki jagan ki pedda fan so idI beginning mathrame so jagan ki pk addu kadu ane vara ku pk ni leputhadu anaka throwing chesthadu
Kondaveeti_Simham

Maharaaju
Registered:
Posts: 20,970
Reply with quote  #6 
edhaina meeku useful ae ga so enjoi
pokiripandu

Baabu
Registered:
Posts: 3,936
Reply with quote  #7 


Muncipal elections lo potee cheyyadam is a blunder by pavan ... if it actually is a correct news

Local body elections lo kotha party gelichee chances almost nill ee time lo

Deenikantee direct ga compete in MLA / MP elections
pokiripandu

Baabu
Registered:
Posts: 3,936
Reply with quote  #8 

Ippudu assalu crucial point .. TDP - Pavan ki dooram entha perugutundi in near future anedi 
Kondaveeti_Simham

Maharaaju
Registered:
Posts: 20,970
Reply with quote  #9 
hype tappa emi ledu
sreek

Super Moderators
Registered:
Posts: 49,871
Reply with quote  #10 
Coming 2 years lo picha clarity vastundi.
Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.