Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets


Sbdb pays Homage to Sri Akkineni NageswaraRao garu !

Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment  
sreek

Super Moderators
Registered:
Posts: 49,871
Reply with quote  #1 

మేం కోరుతున్నదల్లా ప్రజలకు ప్రభుత్వాల జవాబుదారీతనం. పారదర్శకత. మీడియా, ప్రజాస్వామ్యవాదులు మా ఆరోపణల్లోని సత్యాలను, మా ఆవేదనను అర్థం చేసుకుంటారని, సహకరిస్తారని ఆశిస్తున్నాం. తక్షణ డిమాండ్‌గా కాల్పుల విరమణ పాటించి, ఆర్‌కె, గాజర్ల రవి తదితర మావోయిస్టు నాయకుల, శ్రేణుల, ఆదివాసుల ప్రాణాలు కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 
 
తోట రాముని తొడకు కాటా తగిలిందానీ/ చిలుక చీటీ తెచ్చెరా! ఓ విలుకాడా/ మైనా మతలబు చేసెరా!’’
 
                  మాకు ఈ వ్యవస్థ మీద, ఈ రాజ్యం మీద తప్ప ఎవరి మీదా ఏ ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదు. 1998 నుంచి 2002 దాకా ప్రజాస్వామ్యవాదుల కృషి వల్ల విప్లవోద్యమానికీ, ప్రభుత్వానికీ చర్చలు జరగాలి అనే ఎజెండా మీద ఉన్న అంశం కాస్తా 2009 నుంచి ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌, ఆపరేషన్‌ హరిభూషణ్‌, ఆపరేషన్‌ ఆర్‌కె వంటి ఒక ప్రతీకారేచ్ఛగా మారింది. అందువల్ల మేం ఆర్‌కె క్షేమం గురించి ఆందోళన చెందాల్సి వస్తున్నది. పోలీసు అధికారుల ప్రకటనలు, మీడియా కథనాలు ఆర్‌కె అంగరక్షులు ఎన్‌కౌంటర్‌లో చనిపోయినట్లు, ఆయన గాయపడినట్లు చెప్తున్నందువల్ల కూడా ఆందోళన చెందాల్సి వస్తున్నది.
 
 
                  ఆర్‌కె గాయపడిన విషయాన్ని ఈరోజు (అక్టోబర్‌ 28) మధ్యాహ్నం ఆంధ్రజ్యోతి ఏబీఎన్‌కు ఆడియో పంపించిన మావోయిస్టు పార్టీ మల్కన్‌గిరి ఏరియా కమిటీ కార్యదర్శి వేణు ధృవపరిచాడు కూడా. తాను మొదటిరోజు గ్రేహౌండ్స్‌ కాల్పులు జరిపినప్పుడు అక్కడ ఉన్న మావోయిస్టు బృందంలో ఉన్నానని, ఆర్‌కె గాయపడి తప్పించుకోవడం, ఏడుగురు మావోయిస్టులు చనిపోవడం తాను ప్రత్యక్షంగా చూశానని, నలుగురు ఆదివాసులను గ్రేహౌండ్స్‌ చంపడం కూడా చూశానని ఆయన తన ఆడియోలో చెప్పాడు. అట్లాగే ఆర్‌కెతో పాటు ఉదయ్‌ (గాజర్ల రవి) కూడా పోలీసుల అదుపులో కాకున్నా, బలిమెల రిజర్వాయర్‌ ప్రాంతపు కటాఫ్‌ ఏరియాలో ఇల్లిల్లూ గాలిస్తున్న గ్రేహౌండ్స్‌ వలయంలో ఉన్నట్లుగా భావించడం నిరాధారమైంది కాదు.
 
                  2004లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో చర్చలకు వచ్చినప్పుడు ఆర్‌కె మావోయిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్‌, కేంద్ర కమిటీల నాయకుడుగా, రెండు విప్లవ పార్టీల చర్చల బృందానికి నాయకత్వం వహించాడు. అట్లాగే ఆనాడు ఉత్తర తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున గణే్‌షగా గాజర్ల రవి చర్చల్లో పాల్గొన్నాడు. ఇప్పుడేమో ఆర్‌కె తరువాత ప్రాధమ్యంతో ప్రభుత్వం ఆయనను వేటాడుతున్నట్లుగా కనిపిస్తున్నది. మీడియాలో రవి సామ్రాజ్యం అస్తమించిందని, ఇంక ఏవోబీ ఉద్యమం తుడిచిపెట్టుకు పోయిందని కథనాలు వస్తూనే ఉన్నాయి. ఉదయ్‌ (గాజర్ల రవి) రక్షణ టీంలో ఉన్న మున్నా (పృథ్వి), మమత వంటి వాళ్లను పట్టుకొని చంపేశారు. కనుక సహజంగానే గాజర్ల రవి క్షేమం గురించి కూడా ఆందోళన చెందాల్సి ఉంటుంది. తెలంగాణ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ నాయకత్వం, ఏవోబీ ఈస్ట్‌ డివిజన్‌ కమిటీ కార్యదర్శి కైలాసం, మల్కన్‌గిరి ఏరియా కార్యదర్శి వేణు ప్రకటనల ప్రకారం ఆర్‌కె గానీ, గాజర్ల రవి (ఉదయ్‌) గానీ సురక్షితంగా ఉండే అవకాశం లేదని భావిస్తున్నారు. సహచర విప్లవోద్యమ నాయకులుగా వాళ్ల ఆందోళన కూడా చాలా న్యాయమైంది. ఈ మారణకాండలో అమరులైన అజ్ఞాత పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు, ఆదివాసులు కూడా పోలీసుల అదుపులో ఉంటే వెంటనే వదిలేయాలని కూడా మేం డిమాండ్‌ చేస్తున్నాం.
 
                  ఈ సందర్భంగా ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఏ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఏర్పడినాయో అవి పారదర్శకంగా వ్యవహరించడం లేదని మాత్రమే ఆరోపిస్తున్నాం. స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి మృతదేహాలను స్వాధీనం చేసుకున్న సాధికారతతో మేం ఆరోపణ చేస్తున్నాం. సుశిక్షితులు, చట్టానికి కట్టుబడి ఉండాల్సిన గ్రేహౌండ్స్‌ గాలింపు చర్యలు జరిపి కాల్పులు చంపితే అక్కడికక్కడ పద్దెనిమిది మంది, ఆ తరువాత క్రమంలో నిన్నటి దాకా మరో పన్నెండు మంది చనిపోవడం ఏమిటి? మావోయిస్టులు కాల్పులు జరిపితే నలుగురు గ్రేహౌండ్స్‌ మాత్రమే గాయపడడం ఏమిటి? అంటే, గ్రేహౌండ్స్‌ గాలింపులు, ఎన్‌కౌంటర్‌లు మావోయిస్టులనైనా, సానుభూతిపరులనైనా, గ్రామస్తులైన ఆదివాసులనైనా చంపడమే లక్ష్యంగా జరుగుతున్నది. కనుక గాలింపు చర్యలు ఆపివేయాలని డిమాండ్‌ చేస్తున్నాం.
 
                  ప్రభుత్వం అన్నాక, పోలీసు యంత్రాంగం అన్నాక నిషేధిత సాయుధ పార్టీ నాయకులను, సభ్యులను పట్టుకోవడానికి గాలించకుండా ఎట్లా ఉంటుంది అని ఎవరైనా అడగవచ్చు. అయితే ఎస్‌ఐబీ, గ్రేహౌండ్స్‌ గాలింపు చర్యలు పట్టుకోవడం కోసం జరగడం లేదు. చంపడం కొరకే జరుగుతున్నాయి. అట్లా చంపే అధికారం ఏ ప్రభుత్వానికీ పోలీసులకూ రాజ్యాంగం ఇవ్వలేదు. అందుకే చంపే దురుద్దేశంతో జరుగుతున్న గాలింపు చర్యలను వెంటనే ఆపివేయాలని డిమాండ్‌ చేస్తున్నాం.
    
                  ఆపరేషన్‌ ఆర్‌కెలో అక్టోబర్‌ 24న అక్కడికక్కడ చనిపోయిన వారి మృతదేహాలు 24 చెక్కపెట్టెల్లో పెట్టి మల్కన్‌గిరి ఎస్పీ ఆఫీస్‌ ఆవరణలో పెట్టారు. ఈ 24 మృతదేహాల ఫొటోలు ప్రకటించారు. కంటోన్మెంట్‌ ప్రాంతంలో, నగరంలో, దాదాపు తెలుగు నేలంతా తెలిసిన పికెఎం ప్రభాకర్‌ గురించే మాట్లాడుకుందాం. ఆయన సహచరి దేవేంద్రతో పాటు ఆయన మృతదేహాన్ని మేం చూసినప్పుడు, చూసి చూడగానే ముఖమంతా కత్తిగాట్లు. ముఖం దాదాపు పోలికే లేదు. ఆయన పళ్లవరుసను బట్టి దేవేంద్ర అయినా, మేమైనా పోల్చుకోగలిగాం. కాళ్లు విరిచేశారు. అంబులెన్స్‌లోకి తీసుకోవడానికి మృతదైహాన్ని పైకెత్తినప్పుడు లోపలి పేగులొచ్చి బైటపడ్డాయి. దేహం లోపలి నుంచి మాంసం ముద్దలు బయటపడ్డాయి. కరుగుతున్న ఐస్‌గడ్డల నుంచి నెత్తురు ప్రవాహంలా బయటికొస్తున్నది. ఇప్పటి యాదాద్రి జిల్లా దాసిరెడ్డిగూడెం నుంచి రెండున్నర దశాబ్దాల క్రితం విప్లవోద్యమంలోకి వెళ్లి ఉద్దానంలో, శ్రీకాకుళంలో ప్రజలందరూ దేవుడుగా చెప్పుకునే సామల కిష్టయ్య అలియాస్‌ దయ మృతదేహమూ ఇందుకు మినహాయింపు కాదు. అయన అంత్యక్రియలకు ఆయన స్వగ్రామానికి వెళ్లిన ప్రజలందరూ ఆ మృతదేహాన్ని చూశారు. మీడియాతో సహా ఎందరో అతని మృతదేహంపై చిత్రహింసల గుర్తులను తమ తమ మొబైల్‌ ఫోన్‌లలో దృశ్యీకరించారు కూడా.
 
                  శ్రీకాకుళం నుంచి ఏరియా కమిటీ సభ్యురాలుగా ఉన్న మనుమరాలు మమత మృతదేహాన్ని చూసిన ఆమె అమ్మమ్మ దుఃఖాన్ని మల్కన్‌గిరి ఎస్పీ ఆఫీసు ఆవరణలో మేమెవరమూ ఆపలేకపోయాం. ఆ పద్దెనిమిదేళ్ల యువతి మృతదేహంపై అన్ని చిత్రహింసల గుర్తులున్నాయి. మధ్య వయస్కురాలు, అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న భారతి (ఏవోబీ ఎస్‌జెడ్‌సీ రాష్ట్ర కమిటీ సభ్యుడు దుబాశి శంకర్‌ సహచరి) కూడా ఈ ఎన్‌కౌంటర్‌లో అమరురాలైంది. ఆమె వక్షస్థలంపై, శరీరంపై అంతా కత్తికోతలే ఉన్నాయి. పోస్ట్‌మార్టం కోసం కోశారందామా, మళ్లీ కుట్లయినా వేయలేదు. ఆమె కొడుకు, కోడలు ఎందరో మహిళలు ఆమె మృతదేహంపై ఈ గాయాలకు సాక్ష్యమే. ఈ సాక్ష్యా లన్నీ దృశ్యీకరింపబడి ఉన్నాయి. కామేశ్వరి అనే రాజమండ్రికి చెందిన ఒక ఏరియా కమిటీ సభ్యురాలు సీ్త్రల మృతదేహాల్లో ఉన్నదేమోనని స్త్రీల మృతదేహాలున్న పదకొండు చెక్కపెట్టలు తెరిపించి చూశాం. అందులో 20వ నంబరు పెట్టెలో ఉన్న మృతదేహానికి తల లేదు. సీ్త్ర అని అర్థమవుతున్నది. పోల్చుకోవడం ఎట్లా? ఎంత అమానుషం. ఆత్మరక్షణ కొరకు జరిపిన కాల్పులో, ఎదురెదురు కాల్పులో అయితే ఇదెట్లా సాధ్యం. ఇది కచ్చితంగా అదుపులోకి తీసుకొని, చిత్రహింసలు పెట్టి చంపివేయడమే. ఇక పోస్ట్‌మార్టం గురించి. ఎక్కడ జరిపినట్లు?
 
 
                  పికెఎం ప్రభాకర్‌ సహచరి దేవేంద్రకు సమాచారం ఇవ్వకుండానే, ఆమెకు ప్రభాకర్‌ మృతదేహాన్ని చూపకుండానే పోస్ట్‌మార్టం నిర్వహించడం చట్టాన్ని గౌరవించడమే అవుతుందా? కనుక మేం నిరాధారమైన ఆరోపణ ఒక్కటీ చేయడం లేదు. మల్కన్‌గిరి ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా 24 మృతదేహాలను భద్రపరిచే రిఫ్రిజరేటర్‌లు గానీ, ఇతర సౌకర్యాలు గానీ, వనర్లు గానీ ఉండవు కాబట్టే ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి చిలకా చంద్రశేఖర్‌ హైకోర్టులో ఆ మృతదేహాలను విశాఖపట్నం కేజీహెచ్‌ ఆస్పత్రికి తరలించి పోస్ట్‌మార్టం జరపాలని కోరాడు. అప్పుడేమో అడ్వకేట్‌ జనరల్‌ ఆ సంఘటన తమ జ్యూరిస్ డిక్షన్‌లో జరగలేదన్నాడు. ఇప్పుడేమో ఈ మారణకాండకు సంబంధించిన ప్రతి ఆరోపణకు విశాఖ రూరల్‌ ఎస్పీ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర డీజీపీ సమాధానాలు ఇస్తున్నారు. కనుక ఇది ఆంధ్రప్రదేశ్‌ ఎస్‌ఐబీ, గ్రేహౌండ్స్‌ చొరవతో పూనుకొని చేసిన ఆపరేషన్‌ ఆర్‌కె అనేది మళ్లీ ఒకసారి ధృవపడినట్లే కదా. మృతదేహాలను ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశాల ప్రకారం భద్రపరచాలన్న ఏపీ హైకోర్టు ఆదేశాలు ఒడిశా రాష్ర్టానికి సంబంధించి చెల్లనివి అయిపోయాయి. ఇంక మృతుల కుటుంబాలకు ఎన్నో కష్టనష్టాలకోర్చి, ఎంతో దూర ప్రయాణం చేసి మల్కన్‌గిరి దాకా పోక తప్పలేదు. మృతదేహాలు పెట్టిన చెక్కపెట్టెలకు నంబర్లు వేసి, ఆ నంబర్లు సరిపోయే ఫొటోలు చూపి తీసుకుపొమ్మన్నారు.
 
                  వందమందికి పైగా వచ్చిన రక్తబంధువులు మృతదేహాలను చూపి తీరవలసిందేనని పట్టుబట్టడం వల్ల కాని ఆ మాత్రమైనా పెట్టెలు తెరవలేదు. ఇంత అమానవీయమైన పద్ధతులను మమ్ములను చట్టబద్ధమైనవి, న్యాయబద్ధమైనవి, మానవీయమైనవని అంగీకరించమంటున్నది ప్రభుత్వం. ఏ ఒక్క ఆరోపణ కూడా మేం నిరాధారంగా చేస్తున్నది కాదు. ఇది రెండు రాష్ట్ర ప్రభుత్వాల, పోలీసుల నిర్ణయం, చర్య గనుక, ఇందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం ఉంది గనుక మేం ఈ విషయంలో సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ చేయించి నిజానిజాలు తేల్చాలని డిమాండ్‌ చేస్తున్నాం. అదుపులోకి తీసుకొని చిత్రహింసలు పెట్టి చంపారనడానికి, అసలు పోస్ట్‌మార్టం జరగలేదనడానికి, మేం చేస్తున్న ప్రతి ఆరోపణకు ఆధారాలను ఆ న్యాయవిచారణలో చూపగలం.
    
                  మేం కోరుతున్నదల్లా ప్రజలకు ప్రభుత్వాల జవాబుదారీతనం. పారదర్శకత. మీడియా, ప్రజాస్వామ్యవాదులు మా ఆరోపణల్లోని సత్యాలను, మా ఆవేదనను అర్థం చేసుకుంటారని, సహకరిస్తారని ఆశిస్తున్నాం. ఈ న్యాయమైన డిమాండ్లకు తమ మద్దతు కూడా ప్రకటిస్తారని ఆశిస్తున్నాం. ఇంత పెద్ద మారణకాండ నాలుగు రోజులపాటు ఇదివరకెన్నడూ జరగని నేపథ్యంలో ఇది ప్రజాస్వామ్య చైతన్యానికి, విలువలకు ఒక పరీక్ష అని కూడా మేం భావిస్తున్నాం. తక్షణ డిమాండ్‌గా కాల్పుల విరమణ పాటించి, ఆర్‌కె, గాజర్ల రవి తదితర మావోయిస్టు నాయకుల, శ్రేణుల, ఆదివాసుల ప్రాణాలు కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 
  వరవరరావు
sreek

Super Moderators
Registered:
Posts: 49,871
Reply with quote  #2 
clip
sreek

Super Moderators
Registered:
Posts: 49,871
Reply with quote  #3 
So RK chanipoyarani Maoist party cheputhondi. Police matram tama adupu lo vunnaru ani cheputunnaru. Not sure whats the truth
ChupChupTa

Avatar / Picture

Baabu
Registered:
Posts: 3,348
Reply with quote  #4 
RK Ki replacement PK
Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.