Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets


Happy SriKrishna Janmashtami !!

Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment  
python

Avatar / Picture

Soggadu
Registered:
Posts: 6,405
Reply with quote  #1 
ఎంతో అభివృద్ధి చెందడానికి అవకాశమున్న ఆంధ్రప్రదేశ్‌లాంటి బలమైన రాష్ట్రం ఇప్పుడు కరప్షన్‌, కుటుంబం, కులం లాంటి రాజకీయ సమస్యల్లో చిక్కుకొని పురోగతి కరవై కష్టాలు పడుతోంది. భాజపా కార్యకర్తలు ఇలాంటి పెడధోరణులకు వ్యతిరేకంగా నిలబడి ఊరూరా పోరాడాలి. ఇలాంటి రాజకీయాలను ఏపార్టీ చేసినా ఎదిరించాలి’’ అని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ పిలుపునిచ్చారు

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని నేను ఒక్క విషయం చెప్పదలచుకున్నా. ఎవరైనా అధికారంలోకి వస్తే ఏం చేస్తామో ప్రజలకు చెప్పి, వారు వేసే ఓట్ల ఆధారంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తారు. అవినీతి, అక్రమాలపై దర్యాప్తు చేస్తామని వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ పనిచేయాలి. అది చాలా ముఖ్యం కూడా. కానీ భారత ప్రభుత్వ సహకారంతో ప్రపంచబ్యాంకు, ఏడీబీలాంటి అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు తీసుకొని చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన ఒప్పందాల అమలులో ఇబ్బంది కలిగిస్తే అవి పూర్తికావడం చాలాకష్టం. అందువల్ల అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవించాలి. మనకు కారణాలు ఏమైనా ఉండొచ్చు. కానీ... ఒప్పందాలను రద్దు చేసేశామని ప్రకటిస్తే దేశానికి అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టుల్లో ఇబ్బందులు వస్తాయి. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం దీని గురించి ఆలోచించాలి. నేను ఇక్కడ స్థానిక రాజకీయాల గురించి మాట్లాడటంలేదు. మేం ఇచ్చిన వాగ్దానం ప్రకారం చేస్తున్నామంటే చేసుకోవచ్చు. కానీ అంతర్జాతీయ ప్రాజెక్టుల గురించి ఆలోచించాల్సిందే.
python

Avatar / Picture

Soggadu
Registered:
Posts: 6,405
Reply with quote  #2 
ఏపీకి ఇంకా ఏం చేశామంటే...

* ప్రధానమంత్రి ఎంప్లాయ్‌మెంట్‌ గ్యారెంటీ స్కీం కింద ఏపీలో 2,192 ప్రాజెక్టులు నడుస్తున్నాయి.
* లాక్‌డౌన్‌లో 7.83 కోట్ల మంది పేదలకు ప్రధానమంత్రి గరీబ్‌కల్యాణ్‌ అన్న యోజన కింద 39.41 కోట్ల కిలోల ఆహారధాన్యాలు సరఫరాచేశాం. 2.71 కోట్ల మందికి ఏప్రిల్‌, మే, జూన్‌లో ఉచితంగా కందిపప్పు పంపిణీచేశాం.
* రాష్ట్రంలోని 19.6 లక్షల మంది నిర్మాణరంగ కార్మికులకు కన్‌స్ట్రక్షన్‌ ఫండ్‌ నుంచి రూ.196 కోట్లు ఇచ్చాం.
* ఉచిత గ్యాస్‌ సిలిండర్లు ఇచ్చాం. వలసకార్మికుల తరలింపునకు 3 శ్రామిక రైళ్లు కేటాయించాం. ఇంకా ఎన్ని కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. నేను ప్రత్యక్షంగా జోక్యం చేసుకొని హోంమంత్రిత్వ శాఖతో మాట్లాడి గుజరాత్‌లో చిక్కుకున్న మత్స్యకారులను విశాఖపట్నానికి తరలించాం.
Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.