Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets



Jai SreeRam !!

Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment  
shravan_subbu

Registered:
Posts: 482
Reply with quote  #1 

జిల్లాలను విభజించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పార్లిమెంట్ నియోజకవర్గం ప్రాతిపదికన తీసుకుంటుంది అని చదువుతున్నాం. ఇప్పుడు ఉన్న నియోజకవర్గాలు కొత్త పునర్వ్యవస్థీకరణ తరువాత ఉంటాయా. రాష్ట్రాలకు ఉన్న ప్రాతినిధ్యం తగ్గించకుండా జనాభా ప్రాతిపదికన పెంచాలి అనుకుంటే, దేశములో నియోజకవర్గాలు 693 చెయ్యాలి. ఇప్పుడు ఉన్న 542 నియోజకవర్గాలకు పరిమితం చెయ్యాలి అనుకుంటూ, 2011 జనాభా లెక్కల ప్రకారం చేస్తే దక్షిణాది రాష్ట్రాలు 40 పార్లిమెంట్ నియోజకవర్గాలను కోల్పోతాయి. ఒకప్పటి ఆంధ్ర ప్రదేశ్ 10 సీట్లు కోల్పోయి 32 సీట్లకు పరిమితం అవుతుంది. హైదరాబాద్ వల్ల తెలంగాణ 3 కోల్పోతే ఆంధ్ర 7 కోల్పోతుంది.

దేశ జనాభా లెక్కల ప్రకారం ప్రాతినిధ్యం ఉండాలి అనేది ఒప్పుకున్నా, జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలను శిక్షించటం అసమానతలకు గురిచేస్తుంది. ఒక రాఖంగా Robin Hood రాజ్యాన్ని దేశములోకి తెస్తుంది. ఎక్కువ పన్నులు కట్టే రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉండక, ఆ డబ్బులు దేశములో ఇతర రాష్ట్రాలకు వెళ్తాయి.

పెరుగుతున్న జనాభా వల్ల కలిగే నష్టాలను ఈ మధ్య covid కష్టాలతో ప్రపంచం మొత్తం చూసింది. వలస కూలీల కష్టాలు దేశ దారిద్య్రాన్ని సూచించాయి. కేంద్రం బాధ్యతగా జనాభా నియంత్రణను ప్రోత్సహించి, కఠిన చెర్యలు తీసుకోకపోతే, కష్టపడే వాడి ప్రతినిత్యం ఉండదు. తినేవాళ్లు రాజ్యమే నడుస్తుంది.

జనాభా నియంత్రణ అనగానే, మతంలెక్కలు చూపించకుండా, అందరికి చిన్న కుటుంబాల వల్ల వొచ్చే లాభాలను, పిల్లలకు మంచి చదువులు చెప్పించి ప్రాయోజితులను చేసే అవకాశాలను విరివిగా ప్రచారం చెయ్యాలి. చైల్డ్ లేబర్ ను అరికట్టే అన్ని మార్గాలను చూస్తూ కఠినమైన చట్టాలను చేసి చదువుని ప్రోత్సహిస్తే దేశం బాగుపడుతుంది.

ఇక జిల్లాల విభజనకొస్తే, ఇప్పుడు 25 అనుకునేవి, రేపు 18 అవ్వొచ్చు. అప్పుడు కొత్త ఇబ్బందులు వొస్తాయి. జిల్లా హెడ్ క్వార్టర్ అంటూ ఇబ్బందులు ఇప్పటికే ఉన్నాయి. ఆంధ్రాలో కూడా జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను విభజిస్తే, రాయలసీమ, ఉత్తరాంధ్ర నియోజకవర్గాలు ఎక్కువ తగ్గుతాయి, అక్కడ జనాభా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళటం వల్ల కానీ, ఉద్యోగాలు లేక కానీ, వెనకబాటు తనం వల్ల కానీ జనాభా ఎక్కువ శాతం పెరగలేదు.

చీఫ్ సెక్రటరీ నేతృత్వములో కమిటీ వేశారు. చదువుకున్నోళ్ళు, ఇలాంటి వివరాలను గమనించి, అలోచించి నిర్ణయాలు తీసుకుంటారు అనుకుందాం. ఆలోచించే అవకాశం ఇస్తారా అంటారా, అది ఎప్పుడు ఉండే దేశ దరిద్రమేగా.


Image may contain: text
cinelover

Baabu
Registered:
Posts: 3,917
Reply with quote  #2 
Ee committee ani time pass ki naamke vaste annatlu vestaru vallu .
Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.