Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets



EID Mubarak ! 

Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment  
sreek

Super Moderators
Registered:
Posts: 49,835
Reply with quote  #1 

 మహమ్మారి కరోనా నిర్ధారణ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం తీరుపై తెలంగాణ హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టెస్టులు చేయకుండా పౌరుల జీవించే హక్కును కాలరాసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని బుధవారం మండిపడింది. కరోనా వ్యాప్తి కట్టడి, వైద్య సిబ్బందికి పీపీఈ కిట్ల అందజేత తదితర అంశాల్లో గతంలో ఇచ్చిన ఆదేశాలను ఎందుకు పట్టించుకోవడం లేదని సర్కారును ప్రశ్నించింది. మే 23 నుంచి జూన్ 23 వరకు ఎన్ని కరోనా టెస్టులు చేశారు? ప్రైమరీ, సెంకడరీ కాంటాక్ట్స్ శాంపిల్స్ ఎన్ని తీసుకున్నారు? జూన్ 26న టెస్టులు ఎందుకు అపేయాల్సి వచ్చింది? భారత వైద్య పరిశోధనా మండలి మార్గదర్శకాల ప్రకారం లక్షణాలు ఉన్నవారికి, లేని వారికి ఎన్ని పరీక్షలు నిర్వహించారో తెలపాలని ప్రభుత్వాన్ని అదేశించింది.

 

అదే విధంగా రాష్ట్రంలో కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్ర బృందం.. ఎక్కడెక్కడ పర్యటించిందన్న అంశానికి సంబంధించి ఈనెల 17న పూర్తి వివరాలు అందజేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అంతేగాక డాక్టర్లు, పారమెడికల్‌ సిబ్బందికి ఏప్రిల్ 21, జూన్ 8 , జూన్ 18 రోజున ఎన్నెన్ని పీపీఈ కిట్లు ఇచ్చారో తెలపాలని ఆదేశించింది. తదుపరి విచారణలో భాగంగా జూలై 17న న్యాయస్థానం ప్రభుత్వ వివరాలపై సంతృప్తి చెందక పోతే.. జూలై 20న చీఫ్ సెక్రెటరీ, ప్రిన్సిపల్ సెక్రెటరీ హెల్త్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, హెల్త్ కమిషనర్‌ కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. నివేదికలు సమర్పించకపోతే.. కోర్టు ధిక్కరణగా భావిస్తామని హెచ్చరించింది. కరోనా పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై దాఖలైన పిటిషన్‌ను బుధవారం విచారించిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

sreek

Super Moderators
Registered:
Posts: 49,835
Reply with quote  #2 
కరోనా: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

కరోనా: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్‌: ‘‘కరోనా పరీక్షలు నిలిపివేస్తూ ప్రజారోగ్య డైరక్టర్ ఉత్తర్వులు ఇవ్వడం ఆశ్చర్యకరం. ఐసీఎంఆర్ నిబంధనలకు విరుద్ధంగా పీహెచ్ డైరెక్టర్ ఉత్తర్వులు ఉన్నాయి’’ తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు, మీడియా బులిటెన్‌లో అరకొర సమాచారం ఇస్తుండటంపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. మీడియా బులిటెన్‌లో వార్డుల వారీగా కీలక సమాచారం ఉండాలన్న ఆదేశాలు అమలు కావడంలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 

‘‘రాష్ట్రంలో కంటైన్మెంట్ విధానమేంటో తెలపాలి. కంటైన్మెంట్ ప్రాంతాల వివరాలు సమర్పించాలి. గత 20 రోజులుగా జరిగిన కరోనా పరీక్షల వివరాలు తెలపాలి. కేంద్ర బృందం పరిశీలనలో తేలిన అంశాలను సమర్పించండి. ఈ నెల 17లోగా న్యాయస్థానం ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలి. ఒకవేళ అమలు కాకపోతే ఈ నెల 20న సీఎస్‌, వైద్యారోగ్య, మున్సిపల్‌ ముఖ్య కార్యదర్శులు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుంది’’ అని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. 

 
Celluloid_Scientist

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 11,128
Reply with quote  #3 
KCR sir meere maa AP ni kuda save cheyali
Sarada_Bullodu

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 21,454
Reply with quote  #4 
i Still dont understand why KCR is hellbent on not doing many tests..
HYd ni nasanam cheselaa unnadu..
python

Avatar / Picture

Soggadu
Registered:
Posts: 6,196
Reply with quote  #5 
judge: 17th loga guarantee ga vichala vidi tests cheyyali
Dora: ganthane
Judge: antey kadhu poorthi transparency ga undali ... enni tests, enni results waiting etc., mottam report release cheyali every day
Dora: ganthane
Judge: Primary contacts ki kuda test cheyyali
Dora: ganthane
Judge: last time hearing ki mee HM vachadu .. nenu primary contact .. naaku test eppudu chestharu
Dora: equipment center kalli raledhu .. ragane jessam .. gee lopu token teesku waiting line lo kukondi .. shumarga 10 dinalu pattochu .. 17th ki court ki achinappudu aitey result chethilo edatha .. gidaitey khayam
SSMahesh

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 11,792
Reply with quote  #6 
Evadra akada .. eededho gaallo arusukuntunnadu..
yodha

DoraBabu
Registered:
Posts: 5,347
Reply with quote  #7 
Quote:
Originally Posted by Celluloid_Scientist
KCR sir meere maa AP ni kuda save cheyali


maa apartment lo watchman ap vaade , jagan ni bootulu tidtunnadu , kcr ni pogudutunnadu .

maa ap friends anta jagan ni titti kcr ni pogidite ento happy ga undi 

-- i want this athi posts 
saradhi

Registered:
Posts: 170
Reply with quote  #8 
Asalu tg govt problem emiti test cheyadaniki .poor,backward kadu one of the richest state & pharma hub.
Kkkiran

Avatar / Picture

Doctor Babu
Registered:
Posts: 4,475
Reply with quote  #9 
Quote:
Originally Posted by saradhi
Asalu tg govt problem emiti test cheyadaniki .poor,backward kadu one of the richest state & pharma hub.

Hyderabad thappa rest of the state lo infra (testing labs, health workers, ambulance, data collection, traceability) very very poor anukunta..ippati varaku peddha crisis lu leka bayata padaledhu
saradhi

Registered:
Posts: 170
Reply with quote  #10 
Quote:
Originally Posted by Kkkiran

Hyderabad thappa rest of the state lo infra (testing labs, health workers, ambulance, data collection, traceability) very very poor anukunta..ippati varaku peddha crisis lu leka bayata padaledhu


ala anukunna kaneesam hyd lo aina tests cheyyali akkada kuda chetulu ettesaru.
Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.