Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets



Happy Dussehra !

Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment  
babu_mahesh

Jackie
Registered:
Posts: 6,578
Reply with quote  #1 
సీఎం రమేష్ దీక్ష : 21వ రోజు !!
[cmramesh11531223133]

తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ కడప ఉక్కు పరిశ్రమను సాధించడం కోసం చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష మంగళవారం నాటికి 21వ రోజుకు చేరుకుంది. అదేమిటి సీఎం రమేష్ చేస్తున్న దీక్ష జూన్ 30వ తేదీనే ముగిసిపోయింది కదా... వీరికి ఆ మాత్రం తెలియదా అని అనుకుంటున్నారా? ముగిసిపోయింది అనుకుంటే ముగిసిపోయినట్లు కానీ సీఎం రమేష్ చెబుతున్న మాట ప్రకారం ఆ దీక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది.

సోమవారం నాడు తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న సీఎం రమేష్ తాను ఇంకా ఆమరణ నిరాహార దీక్షలోనే ఉన్నానని తిరుమలలో సెలవిచ్చారు. ఉక్కు పరిశ్రమను సాధించే వరకు దీక్షను విరమించేది కూడా లేదని ఆయన ప్రకటించారు. తమాషా ఏంటంటే.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన జరిగే వరకూ తాను గడ్డం తీయబోయేది లేదని.. ఆయన భీషణ ప్రతిజ్ఞ చేశారు.

ప్రస్తుతం ఇంకా తన నిరాహార దీక్ష కొనసాగిస్తున్నానని కూడా సెలవిచ్చారు. అంటే ఆయన ఉద్దేశం.. ఘనాహారం ఏమీ తీసుకోవడం లేదుట. ద్రవాహారం మాత్రం తీసుకుంటున్నారుట. గడ్డం తీయకుండా పెంచుతా అని ప్రకటించిన వాళ్లు మనకు ఇంకా చాలామంది నాయకులూ ఉన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కోసం.. సంగారెడ్డి కాంగ్రెస్ నాయకుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి) గడ్డం ప్రతిజ్ఞ చేశారు. తర్వాత ఆయన అక్కడినుంచి కాలినడకన తిరుమలకు వచ్చి మొక్కు చెల్లించుకున్నారు కూడా.

కానీ కాలక్రమంలో ఆయన గడ్డం ఎంతలా మారిపోయిదంటే.. గడ్డంలేకుండా జగ్గారెడ్డి ఫోటో చూస్తే జర్నలిస్టులు కూడా గుర్తుపట్టలేని పరిస్థితి వచ్చేసింది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తంకుమార్ రెడ్డి గడ్డం దీక్ష కూడా నడుస్తోంది. వాటికితోడు ఏపీలో సీఎం రమేష్ గడ్డం దీక్ష కూడా లెక్క వేసుకోవాలన్నమాట. ఇన్నాళ్లకు తన దీక్ష గురించి సీఎం రమేష్ స్వయంగా నోరువిప్పి చెప్పిన తర్వాత ప్రజలకు చాలా క్లారిటీ వచ్చింది.

ఇన్నాళ్లూ ఆయన 11రోజులు దీక్షచేసినా.. ఏమాత్రం అలుపు సొలుపూ లేకుండా భలే ఉన్నారబ్బా అని జనం అనుకుంటూ వచ్చారు. నిరాహార దీక్ష అంటే ఆయన దృష్టిలో ఘనాహారం తీసుకోకపోవడం అన్నమాట. ద్రవాహారం.. అనగా, సూపులూ, జ్యూసులూ, హార్లిక్సూ గట్రా బలవర్ధక డ్రింకులూ ఎన్నియినా స్వీకరించవస్తూ ఉండవచ్చునన్నమాట. మరి ఉక్కు పరిశ్రమకోసం 21 రోజులు ఏం ఖర్మ... ఎన్ని సంవత్సరాలైనా ఇలా దీక్ష కొనసాగించవచ్చు కదా అనుకుంటున్నారు జనం.

bouncer

Avatar / Picture

Veerabhimanyu
Registered:
Posts: 8,738
Reply with quote  #2 
[rofl] 
GannaReddy

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 17,937
Reply with quote  #3 
Good work sir 👍 edo oka roju meeru cm avutharu sir 👍
Taserface

NTR & CR7
Registered:
Posts: 3,631
Reply with quote  #4 
21 hrs e kashtam 21 days aina inka life support lekunda stable ga unarante keka ... tipss kavali
Srikanth_111

Avatar / Picture

SUPER MAN
Registered:
Posts: 9,447
Reply with quote  #5 
Enni kgs taggadu?
Selbst_Ehre

Avatar / Picture

Desh Ke Netha
Registered:
Posts: 9,285
Reply with quote  #6 
😁
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,355
Reply with quote  #7 
Sakshit or GA[biggrin]
babu_mahesh

Jackie
Registered:
Posts: 6,578
Reply with quote  #8 
Quote:
Originally Posted by saichinu
Sakshit or GA[biggrin]


eenadu 😋

ఉక్కు పరిశ్రమకు పునాది పడేవరకు గెడ్డం తీయనుఎంపీ సీఎం రమేశ్‌

[09071409BRK54A]

కడప: తిరుమల శ్రీవారిని ఎంపీ సీఎం రమేశ్‌ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో రమేశ్‌‌కు ఆలయ పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
 
ఈ సందర్భంగా సీఎం రమేశ్‌ మీడియాతో మాట్లాడుతూ.. కడప ఉక్కు కర్మాగారం నిర్మాణం కోసం తలపెట్టిన దీక్షను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ద్రవ పదార్థాలను మాత్రమే తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రేపు అనంతపురంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పారు. కర్మాగారం నిర్మాణానికి పునాది వేసే వరకు గడ్డం తీయనని శపధం చేశారు.
babu_mahesh

Jackie
Registered:
Posts: 6,578
Reply with quote  #9 
https://www.youtube.com/watch?time_continue=75&v=NX95D7z7cvQ
KCR

Avatar / Picture

NTR
Registered:
Posts: 4,747
Reply with quote  #10 
okayana chala days nundi padhayatralu chesthunadu aa face lo kala taggaledhu [rolleyes]
Vamsy

Avatar / Picture

M E G A S T A R
Registered:
Posts: 33,500
Reply with quote  #11 
Quote:
Originally Posted by Srikanth_111
Enni kgs taggadu?
Last week news lo choosindi aythe ye maathram thaggaledu anta... [biggrin]
Vamsy

Avatar / Picture

M E G A S T A R
Registered:
Posts: 33,500
Reply with quote  #12 
Quote:
Originally Posted by KCR
okayana chala days nundi padhayatralu chesthunadu aa face lo kala taggaledhu [rolleyes]
Paadayatra chesthe thinadam maaneyyalsina avasaram ledu...meeku thelso ledo...
Balukushi

Avatar / Picture

Minor Babu
Registered:
Posts: 2,929
Reply with quote  #13 
Quote:
Originally Posted by saichinu
Sakshit or GA[biggrin]


GA
VIZAG_FAN

I am an intelligent
Registered:
Posts: 15,697
Reply with quote  #14 
Rofl😀😀

Kcr 13days ki poye stage ki vachadu chesthey ala cheyyali.lekuntey maneyyali
Jaitarakaram

Avatar / Picture

Minor Babu
Registered:
Posts: 2,337
Reply with quote  #15 
Guest house lo one day match fans khastalu😁
maharshi

Avatar / Picture

Jackie
Registered:
Posts: 1,265
Reply with quote  #16 
Inka 9 days aagithe one month diet success full gacomplete ayyiddi. Next mural Mohan ni koorcho pettochu
yardstick

Super Moderators
Registered:
Posts: 3,472
Reply with quote  #17 
Next Elections ayye daka cheyyali CM garu ...
Nandu_123

Avatar / Picture

Na Yaldi
Registered:
Posts: 6,821
Reply with quote  #18 
[rofl]
KCR

Avatar / Picture

NTR
Registered:
Posts: 4,747
Reply with quote  #19 
Quote:
Originally Posted by Vamsy
Paadayatra chesthe thinadam maaneyyalsina avasaram ledu...meeku thelso ledo...


thinadam manesadu ani nenekkada cheppa ayana endanaka vananaka ala thiruguthunna kuda alsipoledhani nenu annadhi aa face lo asalu charm poledhu 
KCR

Avatar / Picture

NTR
Registered:
Posts: 4,747
Reply with quote  #20 
Quote:
Originally Posted by yardstick
Next Elections ayye daka cheyyali CM garu ...


jaggu padhayatra kuda okavela kakapothe 2024 daka cheyali [biggrin]
syeraa

Avatar / Picture

Fan
Registered:
Posts: 41,931
Reply with quote  #21 
Quote:
Originally Posted by VIZAG_FAN
Rofl😀😀

Kcr 13days ki poye stage ki vachadu chesthey ala cheyyali.lekuntey maneyyali
[smile]
syeraa

Avatar / Picture

Fan
Registered:
Posts: 41,931
Reply with quote  #22 
Quote:
Originally Posted by Vamsy
Paadayatra chesthe thinadam maaneyyalsina avasaram ledu...meeku thelso ledo...
[biggrin]
Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.