Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets


Happy Birthday to Prime Minister Narendra Modi ji !

Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment  
Npower

Veerabhimanyu
Registered:
Posts: 8,296
Reply with quote  #1 

షాక్ కొట్టే ధరల వెనక వేల కోట్ల దందా..?

 
[uktyux5ze5ductryik-696x398]

ఆంధ్రప్రదేశ్ లో మద్యం బ్రాండ్ ల విషయంలో ఇప్పుడు చాలా వరకు వస్తున్న విమర్శలను మనం చూస్తూనే ఉన్నాం. మద్యం బ్రాండ్ ల విషయంలో కొందరి పెత్తనం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా కనపడుతుంది అని, ప్రముఖ బ్రాండ్ లను అసలు సరిహద్దులు దాటి రానీయకుండా జాగ్రత్తలు పడుతున్నారు అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ లో మద్యం తాగితే ఇక కైలాసమే అంటూ వైసీపీ నేతలే కామెంట్ చేసిన సందర్భాలను మనం చూస్తూ వచ్చాం. రాష్ట్రంలో అమ్ముడవుతున్న మద్యం బ్రాండ్లు కేవలం రాష్ట్రంలో మాత్రమే కనిపిస్తున్నాయి. రాష్ట్రం దాటితే ఈ పేరుతో మద్యం బ్రాండ్లు ఎక్కడా కనిపించవు. దేశంలో ఎక్కడాలేని విచిత్రమైన మద్యం బ్రాండ్లు అమ్ముతున్నారని వైసీపీ ఎంపీ వ్యాఖ్యానించటం పరిస్థితి తీవ్రతకు అడ్డం పడుతుంది.

ఒకే కంపెనీలో తయారవుతున్న వివిధ మద్యం బ్రాండ్లు ప్రజల ఆరోగ్యానికి చేటు చేసే అవకాశం ఉందన్న సదరు ఎంపీ… ఏపీలో తయారయ్యే మద్యం తీసుకుంటే రెండు మూడేళ్లలోనే చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మద్యనిషేధం పేరుతో ఎక్కడాలేని బ్రాండ్లను తీసుకొచ్చి అమ్మడం సరికాదని హితవు పలికిన ఆయన… పేరు, ఊరు లేని బ్రాండ్లను తాగడం మానేయండి అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం చూస్తే… ఇప్పుడు ఏపీలో ఉన్న దాదాపు మెజారిటీ మద్యం బ్రాండ్ లు రాయలసీమలో తయారు అవుతున్నాయి అని తెలుస్తుంది. అది కూడా అధికారపార్టీ అధినాయకుడికి కుడి, ఎడమ భుజాలుగా చెబుతూ వస్తున్న ఇద్దరి ఆధీనంలోనే ఈ దందా జరుగుతుందట. రాజకీయంగా అత్యంత బలంగా ఉన్న ఆ రెండు శక్తులు ఇప్పుడు రాయలసీమలో డిస్టిలరీలను లీజుకు తీసుకుని మద్యం తయారి కొనసాగిస్తున్నారు అని ఆరోపణలు వస్తున్నాయి.

రాయలసీమకు చెందిన నేత కూడా ఇందుకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వేల కోట్ల మద్యం ఇప్పుడు తయారు కావడమే కాదు… విక్రయాల్లో కూడా వారు తయారు చేసే బ్రాండ్ లే ఎక్కువగా ఉండే విధంగా ప్లాన్ చేసి విక్రయించడం మొదలు పెట్టారట. రాజకీయంగా తిరుగులేని శక్తులుగా ఉన్న ఆ రెండు… ప్రముఖ బ్రాండ్ లు రావాలి అంటే ఇంత ఇవ్వాల్సిందే అని స్పష్టం చేస్తూ ఏపీలోకి రానీయకుండా తమ పలుకుబడిని వాడుతున్నారు. మూడు మద్యం కంపెనీలే ఎక్కువగా హవా సాగిస్తున్నాయి. ప్రముఖ మద్యం బ్రాండ్లన్ని రాష్ట్రం నుంచి పరార్ అయ్యాయి. కొత్త, చెత్త, చీఫ్ బ్రాండ్లతో సామాన్యుడి ఆరోగ్యంతో ఆటలు ఆడుతున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. షాక్ కొట్టే ధరల వెనక వేల కోట్ల దందా జరుగుతుందట. నియంత్రణ పేరుతో సొంత బ్రాండ్ ల డిమాండ్ కోసమేనా? అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఆ మూడు మద్యం కంపెనీలు ఎవరివి? తయారీదారులు ఎవరు? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.