Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets


Happy Birthday to Prime Minister Narendra Modi ji !

Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment  
sreek

Super Moderators
Registered:
Posts: 49,871
Reply with quote  #1 
విమానాశ్రయంలో జేసీ వీరంగం
 

బోర్డింగ్ పాసు ఇవ్వకపోవడంతో సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం

 విమానాశ్రయం(గన్నవరం): గన్నవరం విమానాశ్రయంలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి శుక్రవారం ఎయిర్ ఇండియా అధికారులపై చిందులు తొక్కారు. హైదరాబాద్ వెళ్లేందుకు ఆలస్యంగా ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఆయన అప్పటికే బోర్డింగ్ క్లోజ్ కావడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. నా టిక్కెట్ రద్దు చేస్తారా? అంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. తనదైన శైలిలో తిట్లపురాణం అందుకున్నారు.

ఎయిర్ ఇండియా కార్యాలయంలోకి దూసుకెళ్లి అక్కడున్న కంప్యూటర్లను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఉదంతం అంతా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎయిర్‌పోర్టు లాంజ్‌రూమ్‌లో ఉండగానే జరగడం గమనార్హం.
 

gangadhar16

Registered:
Posts: 433
Reply with quote  #2 
Thappu chesi...okkodiki entha pogarlu ra babu

Ee political lu**ha gaallaki siggu vundademo..India lo em chesina chelluthundi ani arrogance

Ilaanti vedhavala nunchi naa deshaaniki eppudu vimukthi kaluguthundo [frown] [frown] [frown]
sreek

Super Moderators
Registered:
Posts: 49,871
Reply with quote  #3 
ఎంపీకే బోర్డింగ్‌ లేదంటారా? 
అధికారులపై జేసీ ఆగ్రహంగన్నవరం, న్యూస్‌టుడే: విజయవాడ విమానాశ్రయంలో శుక్రవారం ఎయిర్‌ ఇండియా అధికారులపై ఎంపీ జేసీ దివాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బోర్డింగ్‌ ముగిసిపోయిందని అధికారులు చెప్పడంతో చిందులు తొక్కారు. సాయంత్రం 4.45 గంటలకు ఎయిర్‌ ఇండియా విమానం దిల్లీ నుంచి హైదరాబాదు మీదుగా గన్నవరం చేరుకుంది. అందులో ప్రయాణించేందుకు జేసీ దివాకరరెడ్డి 5.30 గంటలకు విమానాశ్రయానికి చేరుకున్నారు. అప్పటికే విమానం బోర్డింగ్‌ పూర్తి చేసుకుందని మేనేజరు చెప్పడంతో.. విమానం బయలుదేరలేదు కదా.. అవకాశం కల్పించాలని జేసీ అడిగారు. మీ ప్రయాణం లేదని ప్రోటోకాల్‌ వారు చెప్పటంతోనే బోర్డింగ్‌ ముగించినట్లు అధికారులు చెప్పారు. పైలెట్‌ ఒక్కసారి డోర్‌ క్లోజ్‌ చేసిన తర్వాత తీయటం అసాధ్యమని చెప్పారు. ఎంపీ అయిన నాకే బోర్డింగ్‌ క్లోజ్‌ అని చెబుతారా? అంటూ జేసీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడే ఉన్న కంప్యూటర్‌ను ధ్వంసం చేయటానికి ప్రయత్నించగా అధికారులు నివారించారు. విషయం తెలుసుకున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని అక్కడకు చేరుకుని ఎంపీ జేసీ దివాకరరెడ్డిని సముదాయించారు.
Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.