Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's DuetsForum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment  
sreek

Super Moderators
Registered:
Posts: 49,872
Reply with quote  #1 
రాజధాని కాకపోవడం ఓ రకంగా మంచిదే
 
అందమైన నగరం అద్భుతమవ్వాలి
ఉక్కు సిటీ ఉన్నతంగా వృద్ధి చెందాలి
 
ఆర్కే బీచ్‌.. అలా ముందుకుపోతే కురుసురా సబ్‌మెరైన్‌ సమీపంలోని పార్కు.. అక్కడ.. అటు అలల హోరు.. ఇటు పెద్దమనుషుల మాటల జోరు.. అందరూ తలపండిన వారే.. జీవితాన్ని కాచి వడబోసినవారే.. డాక్టరొకరు.. రిటైర్డ్‌  నేవీ ఉన్నతాధికారి ఇంకొకరు.. లెఫ్టినెంట్‌గా పనిచేసిన వారు మరొకరు.. వారికితోడు ఇద్దరు, ముగ్గురు సీనియర్‌ సీటిజన్లు.. రోజూ సాయం సమయాల్లో .. ఆ పార్కులో వారి సమాగమం.. పిచ్చాపాటి కబుర్లతోపాటు సమాజహితంపై చర్చోపచర్చలు..

వారందరిలోకి నిండైన విగ్రహం, పొడవాటి ముక్కు, సూటిగా చూసే కళ్లు, వయసుపైబడినా నెరవని జుట్టు.. మొత్తంగా ఆకట్టుకునే తీరు.. జీవితాన్ని వడబోసిన అనుభవ సారాన్ని మాటల్లో చిలకరిస్తూ ప్రత్యేకంగా కనిపించే ఓ పెద్దాయన.. ఆయన ఎవరో కాదు.. విశాఖ శిఖరం గొల్లపూడి మారుతీరావు.. రచయిత, ప్రయోక్త, కథకుడు, సినీనటుడు, దర్శకుడు.. అన్నింటికీ మించి తన రచనలతో సమాజహితాన్ని కాంక్షించే పెద్దమనిషి గొల్లపూడి మాటల్లో విశాఖపై ఆయనకున్న ఆప్యాయత.. ఆ ప్రస్తావనే వస్తే చాలు.. ఆయన ముఖంలో కనిపించే వెలుగు.. ఆ వెలుగు వీచిక విశాఖేనంటున్న ఆయనతో మాట–మంచి.. ఈ వారం విశాఖ తీరంలో..
   
 
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
ప్రకృతి గీసిన అద్భుత చిత్రంలా ఉండే విశాఖపట్నం అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే. అటువంటి అందమైన నగరంలో సొంతిల్లు కట్టుకుని సెటిల్‌ అవ్వాలని ఉందని మెగాస్టార్‌ నుంచి మినీస్టార్ల వరకూ చాలామంది సినీనటులు తమ మనసులో మాటగా చాలాసార్లు బయటపెట్టారు. ఎవరో ఏమో గానీ.. విశాఖ నుంచే జీవన ప్రస్థానం ప్రారంభించి రచయితగా,  సినీనటుడిగా విజయవాడ, చెన్నై, తిరుపతి, హైదరాబాద్‌ వంటి నగరాలన్నీ కలియదిరిగిన గొల్లపూడి మారుతీరావు స్థిరనివాసం మాత్రం విశాఖలోనే ఏర్పరచుకున్నారు.

తన తల్లిదండ్రులు కాలం చేసిన చోట, దురదృష్టవశాత్తూ కుమారుడు కన్నుమూసిన నగరంలోనే తీపి,చేదు జ్ఞాపకాల కలబోతగా అల్లుకున్న పందిరి నీడలో సేదతీరుతున్నారు. ఉదయం లేచింది మొదలు రచనా వ్యాసాంగంలో మునిగిపోవడం, సాయంత్రం వేళ.. అలా బీచ్‌కు వెళ్లి స్నేహితులతో కలిసి కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకోవడం, సాంస్కృతిక సంస్థలు ఆహ్వానిస్తే వెళ్లి నాలుగు మంచిమాటలు చెప్పిరావడం.. ఇదీ గొల్లపూడి జీవనశైలి.

ఇక ఎవరైనా తన నటనానుభవం అవసరమై సినిమాల్లో ప్రత్యేక పాత్రలు కల్పిస్తే.. వారి కోరిక మేరకు షూటింగులు జరిగే ప్రదేశాలకు వెళ్లి నటించి, డబ్బింగ్‌ చెప్పేసి తిరిగి విశాఖ చేరుకుంటారు. ఎక్కడికెళ్లినా.. ఎన్ని ప్రదేశాలు తిరిగినా విశాఖను చూస్తే కలిగే ఆనందమే వేరని గొల్లపూడి చెబుతుంటారు.
 
రాజధాని కాని రాజధాని
విశాఖ నగరాన్ని ఇంకా శోభాయమానంగా తీర్చిదిద్దవచ్చని గొల్లపూడి అభిప్రాయపడ్డారు. ఓ రకంగా విశాఖ రాష్ట్ర రాజధాని కాకపోవడం మంచిదేనని ఆయన వ్యాఖ్యానించారు. నగరం ఇప్పటికే పరిమితి మేరకు అభివృద్ధి చెందింది.. రాజధాని అయితే వందలు వేల బహుళ అంతస్తుల నిర్మాణాలు వస్తాయి.

లక్షల జనాభా పెరిగిపోతుంది.. రవాణా అవసరాలు.. ప్రజల రాకపోకలు మితిమీరిపోతాయి. ఇన్నింటినీ తట్టుకునే శక్తి ఈ నగరానికి ఉందా అంటే.. ప్రశ్నార్ధకమే. నగర సహజసిద్ధమైన అందం చెడిపోయే ప్రమాదముంది. అందుకే అభివృద్ధి సవ్యంగా జరగాలి. నగరంలోని ప్రాంతాలన్నీ ప్రణాళికాబద్ధంగా పురోగమించాలి.

ఇప్పుడు విశాఖకు పాలకులు ప్రకటించిన మెరైన్‌ వర్సిటీ, పెట్రో వర్సిటీ... అవన్నీ వస్తే చాలు. ఉక్కు నగరం పక్కా ప్రణాళికతో పటిష్టంగా అభివృద్ధి చెందుతుంది. అయినా, రాజధాని కాకున్ననూ రాజధానులెన్నింటికో రాదారి అయిన విశాఖ కూడా అభివృద్ధికి రాజధానే అని ఆయన అభివర్ణించారు.
 
స్టూడియోలు లేకున్నా సినీపరిశ్రమ విశాఖలో వృద్ధి చెందుతుంది
ఒకప్పుడు సినిమా షూటింగ్‌ అంటే నానా హడావుడి.. పేద్ద పేద్ద కెమెరాలు.. స్టడీ కెమెరాలు,  లైటింగ్, భారీ మేకప్‌.. వాటి వేడికి ముఖాలు వాడిపోయేవి. జుట్టు కూడా రాలిపోయేది. కానీ ఇప్పుడు చిత్రీకరణ శైలే మారిపోయింది. సెల్‌ఫోన్‌తో సినిమా షూట్‌ చేసే పరిస్థితులొచ్చేశాయి..

ఈ నేపథ్యంలో స్టూడియోల అవసరం తగ్గిందనే చెప్పాలి. భారీ స్టూడియోలను దాటి... అవుట్‌డోర్‌ సెట్టింగులను దాటి ఇప్పుడు సినిమా షూటింగ్‌ మన నట్టింట్లోకి వచ్చేసింది. ఈ రోజుల్లో షూటింగ్‌ చేసేందుకు.. భారీ సెట్టింగ్‌లు అక్కరలేదు. ఎక్కడైనా షూట్‌ చేసుకోవచ్చు. మా ఇంటి వరండాలో వచ్చే ఎండ(సన్‌లైట్‌) వెలుతురులో కూడా షూట్‌ చేసే సాంకేతిక పరిజ్ఢానం అందుబాటులోకి వచ్చింది.

ఈ పరిస్థితుల్లో స్టూడియోల గురించి ఎక్కువగా ఆలోచించనక్కర్లేదు. అంతెందుకు ఒకప్పుడు డబ్బింగ్‌ కోసం స్టూడియోలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరం కూడా లేకుండా డబ్బింగ్‌ చెప్పే పరిజ్ఞానం వచ్చేసింది. బ్రహ్మోత్సవం సినిమాకు నేను వైజాగ్‌లోనే డబ్బింగ్‌ చెప్పేశాను. రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి అందమైన లొకేషన్లు విశాఖలోనే ఉన్నాయని నేను కొత్తగా చెప్పనక్కర్లేదు. ఈ అందమైన విశాఖను అద్భుతంగా తీర్చిదిద్దితే మరింత శోభాయమానమై వెలుగులు విరజిల్లుతుంది.
sreek

Super Moderators
Registered:
Posts: 49,872
Reply with quote  #2 
Nicely said by Maruthi Rao garu
jay

Avatar / Picture

comfort
Registered:
Posts: 20,472
Reply with quote  #3 
Vizag [thumb] I will see you very very soon
Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.