Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets



Jai SreeRam !!

Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment  
crazzyboy

proud hater
Registered:
Posts: 5,389
Reply with quote  #1 

ముంబయి ఫ్లైట్‌ ఎక్కుతున్న తెలుగు కథలు


ముంబయి ఫ్లైట్‌ ఎక్కుతున్న తెలుగు కథలు

తెలుగు సినిమా బాలీవుడ్‌కి వెళ్లడం కొత్తేమీ కాదు. అయితే వరుసగా తెలుగు సినిమాలు ముంబయి ఫ్లైట్‌ ఎక్కుతుండటం మాత్రం ఇప్పుడు కొత్త విషయమే కదా! కొత్త దర్శకులు రావడం, సీనియర్‌ దర్శకులు ఇంకాస్త పదును పెంచి కొత్త పుంతలు తొక్కుతుండటం లాంటివి దీనికి కారణాలుగా చెప్పొచ్చు. మరోవైపు మన సినిమాల్లో మాస్‌ మసాలాను బాలీవుడ్‌ ప్రేక్షకులు బాగా ఇష్టపడుతుండటమూ ఓ కారణమే. అలా ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదికిపైగా సినిమాలు బాలీవుడ్‌కి వెళ్తున్నాయి. ఇంకొన్నింటి విషయంలో చర్చలు జరుగుతున్నాయి.  అన్నట్లు కొన్ని సినిమా కథలతో పాటు దర్శకులూ బాలీవుడ్‌కు వెళ్తున్నారు.


11 ఏళ్ల తర్వాత

అనుష్క కెరీర్‌ని మలుపుతిప్పిన సినిమా ‘అరుంధతి’. దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత శ్యామ్‌ప్రసాద్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఇందులో నటనకు గానూ అనుష్కకు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారం కూడా దక్కింది. ఆ సినిమాను బాలీవుడ్‌కి తీసుకెళ్లడానికి చాలా ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే  11 ఏళ్ల తర్వాత ఆ అవకాశం ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కి దక్కింది. శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డి నుంచి ఈ సినిమా రీమేక్‌ హక్కులు కొన్న అరవింద్‌, మరో నిర్మాత మధు మంతెనతో కలసి బాలీవుడ్‌లో రీమేక్‌ చేస్తున్నారు. అనుష్క పాత్ర కోసం ప్రముఖ కథానాయిక దీపిక పదుకొణెను సంప్రదించారని భోగట్టా. 

 


నవ్వుల ఏజెంట్‌

మూస సినిమాలకు దూరంగా టాలీవుడ్‌లో తెరకెక్కిన చిత్రాల్లో ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’. రైల్వేట్రాక్‌ల పక్కన పడి ఉన్న శవాల మిస్టరినీ వినోదాత్మకంగా చూపిస్తూ తెరకెక్కించిన చిత్రమిది. నవీన్‌ పొలిశెట్టి కథానాయకుడిగా నటించిన ఈ సినిమా వివిధ భాషల్లోకి రీమేక్‌ కాబోతోంది. అందులో భాగంగా హిందీలోకి కూడా వెళ్తోంది. దీంతోపాటు జపనీస్‌లోకి డబ్‌ చేస్తున్నట్లు సమాచారం.  మరో పది రోజుల్లో ఈ సినిమా రీమేక్‌ విషయంలో ప్రకటన ఉండొచ్చని తెలుస్తోంది. బాలీవుడ్‌లో ఈ తరహా మర్డర్‌ మిస్టరీ సినిమాలకు ఆదరణ ఎక్కువగా ఉండటంతో ఈ సినిమా బీటౌన్‌కు తీసుకెళ్తున్నారట. అలాగే సెప్లెంబరులోగానీ అక్టోబరులోగానీ జపనీస్‌లోకి డబ్‌ చేసి విడుదల చేసేందుకు చిత్ర బృందం సమాయత్తమవుతోంది.

 


బాలీవుడ్‌ వైకుంఠపురం

ఈ ఏడాది విడుదలైన అతి తక్కువ సినిమాల్లో బాక్సాఫీసు దగ్గర దుమ్మురేపిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. చాలా రోజులు గ్యాప్‌ తీసుకొని అల్లు అర్జున్‌ చేసిన ఈ సినిమా సంక్రాంతికి వచ్చింది. అప్పటి నుంచి ఈ సినిమా  బాలీవుడ్‌కి వెళ్తోందని వార్తలు వస్తున్నాయి. అయితే స్పష్టమైన ప్రకటన రాలేదు. తొలుత రణ్‌వీర్‌ సింగ్‌ కథానాయకుడిగా నటిస్తాడని వార్తలు రాగా, తర్వాత కార్తిక్‌ ఆర్యన్‌ నటిస్తున్నాడని వార్తలొస్తున్నాయి. అక్కడ ఈ సినిమాకు అల్లు అరవింద్‌ నిర్మాతగా వ్యవహరిస్తాడని అంటున్నారు. 


డీజే మోగించేదెవరు

అల్లు అర్జున్‌ 25వ సినిమా ‘డీజే - దువ్వాడ జగన్నాథం’ కూడా బాలీవుడ్‌కి వెళ్లబోతోందని సమాచారం. చాలా రోజుల నుంచి ఈ సినిమా విషయంలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. బాలీవుడ్‌ యువ కథానాయకుడు సిద్ధార్థ మల్హోత్ర ఈ సినిమాలో కథానాయకుడిగా నటిస్తాడని తెలుస్తోంది. కరోనాకు ముందు ఈ సినిమా చర్చలు చివరి దశకు వచ్చాయి. త్వరలోనే ఈ సినిమా విషయంలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ సినిమా కథతోపాటు దర్శకుడు హరీశ్‌ శంకర్‌ బాలీవుడ్‌లో అడుగుపెడతారని భోగట్టా. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 


హిట్‌ కొట్టడానికి

మర్డర్‌ మిస్టరీని ఛేదించడం.. కిడ్నాప్‌ కేసులను ట్రేస్‌ చేయడం అంటే బాలీవుడ్‌కి చాలా ఇష్టం. అలా బాలీవుడ్‌ ఎంచుకున్న కొత్త తెలుగు కథ ‘హిట్‌’. ఈ ఏడాది కరోనా - లాక్‌డౌన్‌ ముందు విడుదలై మంచి విజయం అందుకున్న ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్‌కి వెళ్తోంది. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న రాజ్‌కుమార్‌ రావ్‌ ప్రధాన పాత్రలో ‘హిట్‌’ సినిమాను బాలీవుడ్‌కి తీసుకెళ్లబోతున్నారు. తెలుగులో విశ్వక్‌సేన్‌ ఆ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ప్రియురాలి కిడ్నాప్‌తో మొదలయ్యే కథ... అనేక మలుపులు తిరిగి ఎలా ముగిసింది... హీరో ఎలా ముగించాడు అనేదే కథ. తెలుగులో ‘హిట్‌’ను తెరకెక్కించిన శైలేష్ కొలను హిందీ రీమేక్‌కి కూడా దర్శకత్వం వహిస్తారు. ప్రముఖ నిర్మాత  దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆయనతోపాటు మరో నిర్మాతగా కుల్దీప్ రాఠోడ్ వ్యవహరిస్తారు. 


గ్రౌండ్‌ సిద్ధం చేస్తున్నారు

యువ కథానాయకుడు నాని న‌టించిన క్రికెట్‌ నేపథ్య చిత్రం `జెర్సీ`. తెలుగులో మంచి విజ‌యాన్ని అందుకున్న ఈ సినిమా బాలీవుడ్‌కి వెళ్తోంది. ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్‌, దిల్‌ రాజు ఈ సినిమా బాలీవుడ్‌కి తీసుకెళ్తున్నారు. అక్కడ అమన్‌ గిల్‌తో కలసి ఈ సినిమా నిర్మిస్తారు. ‘కబీర్‌ సింగ్‌’ రీమేక్‌తో మంచి విజయాన్ని అందుకున్న షాహిద్‌ కపూర్‌ ‘జెర్సీ’ రీమేక్‌లో నటిస్తున్నాడని సమాచారం.  మాతృక ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి ఈ సినిమాతో బాలీవుడ్‌లోకి ప్రవేశిస్తున్నాడని టాక్‌. ఇందులో కథానాయికగా మృణాల్‌ ఠాకూర్‌ను ఎంచుకున్నారట. 


డ్రైవర్‌ ఎవరో

విజయ్‌ దేవరకొండ సినిమాల్లో వైవిధ్యమైనది, నటుడిగా ఆయనకు పేరు తెచ్చిన చిత్రం ‘టాక్సీవాలా’. ఒక కారు చుట్టూ తిరిగే ఎమోషనల్‌ జర్నీగా తెరకెక్కిన ఈ సినిమాను ‘ఖాళీ పీలి’ పేరుతో బాలీవుడ్‌లో రీమేక్‌ చేస్తున్నారట. ఇందులో ఇషాన్‌ ఖట్టర్‌ కథానాయకుడిగా నటించనుండగా.. అనన్య పాండేను కథానాయికగా ఎంచుకున్నారట. జీ స్టూడియోస్‌, అలీ అబ్బాస్‌ జాఫర్‌ కలసి నిర్మించబోతున్న ఈ సినిమాకు మక్బూల్‌ ఖాన్‌ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. 


మత్తెక్కేదెవరికి

కొత్త తరం పరిశ్రమలోకి వస్తే... కొత్త తరహా సినిమాలు వస్తాయి అనడానికి నిదర్శనం ‘మత్తు వదలరా’. కీరవాణి తనయుడు జైసింహా, నరేశ్‌ అగస్త్య, సత్య ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. మర్డర్‌ మిస్టరీ, థ్రిల్లర్‌ జోనర్‌లో రూపొందిన ఈ సినిమా కూడా బాలీవుడ్‌కి వెళ్తోంది. ఇక్కడ దర్శకత్వం వహించిన రితేశ్‌ రాణా అక్కడ కూడా తెరకెక్కించబోతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే రీమేక్‌కు సంబంధించిన స్క్రిప్టు వర్క్‌ మొదలైపోయింది. అక్కడ ఎవరు నటిస్తారనే విషయంలో స్పష్టత లేదు. 


విశ్వరూపం చూపేదెరు

హారర్‌ జోన్‌లో మొదలై, క్రైమ్‌ మిస్టరీగా మారి టాలీవుడ్‌లో అందరినీ అలరించిన సినిమా ‘భాగమతి’. అనుష్క ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా బాలీవుడ్‌కి వెళ్తోంది. అనుష్క తన నటనా విశ్వరూపం చూపించిన ఈ సినిమాకు ఇక్కడ మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు అక్కడ అనుష్క స్థానంలో భూమి పెడ్నేకర్‌ కనిపించబోతోంది. ఈ సినిమాకు సంబంధించి పూర్వ నిర్మాణ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ‘భాగమతి’ని తెరకెక్కించిన అశోక్‌ అక్కడ ‘దుర్గావతి’కి దర్శకత్వం వహిస్తారు. దుర్గావతి ఏంటి అంటారా?.. మన భాగమతి అక్కడికెళ్లాక దుర్గావతి అయ్యింది లెండి. 


డబుల్‌ వినోదం

ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌ అంటూ గతేడాది టాలీవుడ్‌లో నవ్వులు పూయించి, కాసులు పండించిన చిత్రం ‘ఎఫ్‌ 2’. వెంకటేశ్‌, వరుణ్‌తేజ్, తమన్నా, మెహరీన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఫన్‌ రైడ్‌ అంటే ఇష్టపడే బాలీవుడ్‌ జనాలు ఈ సినిమాని ఆదరిస్తారనే నమ్మకంతో దిల్‌ రాజు బాలీవుడ్‌కు తీసుకెళ్తున్నారు. బోనీ కపూర్‌తో కలసి ‘ఎఫ్‌2’ను బాలీవుడ్‌కి తీసుకెళ్తున్నారు. అక్కడ ఎవరు నటిస్తారు, ఎవరు తెరకెక్కిస్తారనే తెలియాల్సి ఉంది. 


సన్నీ కొడుకు అరంగేట్రం 

చిన్న సినిమాగా విడుదలైన పెద్ద విజయం అందుకున్న సినిమా ‘బ్రోచేవారెవరురా’. శ్రీవిష్ణు, నివేదా థామస్‌, నివేదా పేతురాజ్‌, సత్యదేవ్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రం బాలీవుడ్‌కు వెళ్తోంది. దీని కోసం అభిషేక్‌ నామా ఈ సినిమా రీమేక్‌ రైట్స్‌ కొనుక్కున్నారని సమాచారం. తెలుగులో ఈ సినిమాను తెరకెక్కించిన వివేక్‌ ఆత్రేయ... హిందీకి కూడా వెళ్తారని వార్తలొచ్చినా.. దానిపై స్పష్టత లేదు. సన్నీ దేవోల్‌ తనయుడు కరణ్‌ ఈ సినిమాతో తెరంగేట్రం చేస్తాడని సమాచారం.

Pandu25

Avatar / Picture

Jackie
Registered:
Posts: 1,552
Reply with quote  #2 
Anni movies hit avutay akkada 👍

Tollywood 🔥🔥🔥⚡⚡⚡
Visakhapatnam_fan

Maharaaju
Registered:
Posts: 16,440
Reply with quote  #3 
Dj,f2 na🤦
python

Avatar / Picture

Soggadu
Registered:
Posts: 6,295
Reply with quote  #4 
hindi movies evi telugu lo teeyalo kuda application pettandi

Girl_Universe

Avatar / Picture

Mirapakay
Registered:
Posts: 46,154
Reply with quote  #5 
DJ every week Akkada Hindi channels lo vestune untaru. Adi kuda remake ah
thej

DoraBabu
Registered:
Posts: 5,447
Reply with quote  #6 
Quote:
Originally Posted by python
hindi movies evi telugu lo teeyalo kuda application pettandi



Inka anthe digajarchledhu industry.....
Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.