Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets


Happy Birthday to Prime Minister Narendra Modi ji !

Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment  
sreek

Super Moderators
Registered:
Posts: 49,871
Reply with quote  #1 

[636135646640009634]
  • సెక్యూరిటీ గార్డును చంపి జైలు నుంచి పరార్‌
  • భోపాల్‌లో సిమీ ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌
  • చొప్పదండి బ్యాంకు దోపిడీకేసులోని ముగ్గురు హతం
భోపాల్‌, న్యూఢిల్లీ, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): మరో భారీ ఎన్‌కౌంటర్‌ కలకలం చెలరేగింది. గార్డును చంపి, జైలు నుంచి తప్పించుకుని పారిపోయిన 8 మంది సిమీ ఉగ్రవాదులు మధ్యప్రదేశ్‌ పోలీసుల చేతిలో మరణించారు. ఆదివారం అర్ధరాత్రి తప్పించుకున్న సిమీ ఉగ్రవాదులు కొన్ని గంటల్లోనే భోపాల్‌ శివార్లలో శవాలై తేలారు. పోలీసుల కథనం ప్రకారం... అది భోపాల్‌ కేంద్ర కారాగారం! అత్యంత దుర్భేద్యమైన జైలు! అందులో 8మంది కరుడుగట్టిన నిషేధిత సిమీ (స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఇన్‌ ఇండియా)కార్యకర్తలు! ఆదివారం అర్ధరాత్రి... దీపావళి టపాసుల పొగ జైలు ప్రాంతంలో దట్టంగా వ్యాపించింది. ఆపైగా... అమావాస్య చీకటి! దీనిని అవకాశంగా చేసుకున్న సిమీ కార్యకర్తలు అంజాద్‌, జకీర్‌ హుస్సేన్‌ సాదిక్‌, మొహమ్మద్‌ సాలిక్‌, ముజీబ్‌ షేక్‌, మెహబూబ్‌ గుడ్డూ, మొహమ్మద్‌ ఖాలిద్‌ అహ్మద్‌, అకీల్‌, మజీద్‌ పరారీకి పథకం రచించారు. బ్యారక్‌-బిలో ఉన్న వీరు ఆదివారం అర్ధరాత్రి దాటాక... 2 గంటల మధ్య బ్యారక్‌ తాళం పగులగొట్టారు. బయటికి వచ్చారు. దుప్పట్లను తాళ్లలా మార్చుకుని... బ్యారక్‌ పక్కనే ఉన్న 25 అడుగుల గోడను ఎక్కి దూకారు. వీరు గోడ ఎక్కుతున్నప్పుడే హెడ్‌కానిస్టేబుల్‌ రమాశంకర్‌ యాదవ్‌ అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అయితే, భోజనానికి ఉపయోగించే అల్యూమినియం ప్లేటును తుంచి, దానినే పదునైన ఆయుధాంగా ఉపయోగించి, రమాశంకర్‌ యాదవ్‌ గొంతు కోశారు. ఆయన అక్కడికక్కడే మరణించారు. రమాశంకర్‌ వద్ద ఉన్న తుపాకీతో సహా... వేకువజామున 2.30 ప్రాంతంలో 8మంది సిమీ కార్యకర్తలు జైలు నుంచి తప్పించుకున్నారు.
 
 
ఇలా ‘హతం’ అయ్యారు!
సినీ కార్యకర్తలు జైలు నుంచి పరారైన విషయం సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో పోలీసు ఉన్నతాధికారులకు చేరింది. ఆక్షణం నుంచే వారికోసం వేట మొదలైంది. భోపాల్‌ సరిహద్దులన్నిటినీ మూసివేశారు. పారిపోయిన వారి ఫొటోలను టీవీల్లో ప్రసారం చేసి.. సమాచారం తెలిపిన వారికి ఐదు లక్షల బహుమతిని ప్రకటించారు. ఐపీఎస్‌ అధికారి సంజీవ్‌ షామి నేతృత్వంలో కౌంటర్‌ టెర్రరిస్టు గ్రూప్‌ (సీటీజీ), యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్‌(ఏటీఎస్‌) పోలీసులతో సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో... సిమి ఉగ్రవాదులు భోపాల్‌కు 25 కిలోమీటర్ల దూరంలోని మలిఖెదా అనే గ్రామంలో స్థానికులకు కనిపించారు. మొదట వారందరినీ దొంగలుగా భావించి పట్టుకోవడానికి ప్రయత్నించారు. సిమి కార్యకర్తలు రాళ్లతో దాడికి దిగడంతో స్థానికులు వారిని చుట్టుముట్టి ఎక్కడికీ కదలనివ్వకుండా చేసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే షామి టీమ్‌ రంగంలోకి దిగింది. మలిఖెదా చేరుకుని.. లొంగిపోవాల్సిందిగా సిమీ కార్యకర్తలను హెచ్చరించారు. వారు పట్టించుకోకుండా పోలీసులపైనా రాళ్లతో దాడి చేశారు. తరువాత.. మరణించిన హెడ్‌కానిస్టేబుల్‌ వద్ద నుంచి తీసుకొచ్చిన తుపాకీతో కాల్పులు జరిపారు. పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో... మొత్తం 8 మంది అక్కడికక్కడే చనిపోయారు. సిమీ కార్యకర్తల ఎన్‌కౌంటర్‌పై విపక్షాలు, ఇతర సంఘాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా... స్వయానా మధ్యప్రదేశ్‌ హోంమంత్రి భూపేంద్ర సింగ్‌ దీనిపై వివాదాస్పద ప్రకటన చేశారు. కంచాలు, చెంచాలే ఆయుధాలుగా పోలీసులపై సిమి ఉగ్రవాదులు దాడిచేశారన్నారు. ఆ తర్వాత మాట మార్చారు. పోలీసులపై వారు కాల్పులు జరిపారని, అందుకే ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చిందని తెలిపారు. ‘ఎన్‌కౌంటర్‌’కు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. అప్పటికే నిశ్చలంగా ఉన్న వారిపై ఒక పోలీసు అతి సమీపం నుంచి కాల్పులు జరుపుతున్న దృశ్యాలు బయటపడ్డాయి. అలాగే, చనిపోయిన సిమీ కార్యకర్త దుస్తుల్లో దాచుకున్న కత్తిని తీసి, మళ్లీ యథాస్థానంలో ఉంచిన దృశ్యాలూ కనిపించాయి. ఇక... దూరంగా చిన్న గుట్టపై గుమికూడిన సిమీ కార్యకర్తలు, వారి వైపు వెళ్తున్న పోలీసులకు సంబంధించిన వీడియో కూడా బయటపడింది. ఇది బూటకపు ఎన్‌కౌంటరని విపక్షాలు ఆరోపించాయి. అయితే తీవ్రవాదులు పెద్దఎత్తున కాల్పులు జరిపారని, ఎదురు కాల్పుల్లోనే వారు హతమయ్యారని ఐజీ యోగేశ్‌ చౌధురి స్పష్టం చేశారు. మృతదేహాల వద్ద 4 దేశీయ తుపాకులు, మరికొన్ని పదునైన ఆయుధాలు లభించాయని చెప్పారు. మరోవైపు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారంటూ భోపాల్‌ జైలు సూపరింటెండెంట్‌, జైళ్ల డీఐజీ, డిప్యూటీ సూపరింటెండెంట్‌, అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌లను మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.
 
 
ఇది రెండోసారి...
జమాతే ఇస్లామీ హింద్‌కు విద్యార్థి విభాగంగా ‘సిమీ’ ఉండేది. 1981లో ప్రధాన సంస్థ నుంచి విడిపోయింది. బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తుండడంతో 2001లో కేంద్రం దానిపై నిషేధం విధించింది. ఆ సంస్థ కార్యకర్తలు జైలు నుంచి తప్పించుకోవడం మూడేళ్లలో ఇది రెండో సారి. 2013 అక్టోబరు 1న పై ఎనిమిది మందిలో ఏడుగురు మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలు నుంచి తప్పించుకున్నారు. వారిలో ఇద్దరు పట్టుబడగా.. ఒకరు ఎన్‌కౌంటరులో చనిపోయాడు. మిగతా నలుగురిని అరెస్టు చేసేందుకు మూడేళ్లు పట్టింది. ఈ మూడేళ్లలో వారు మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, ఒడిసాల్లో పలు తీవ్రవాద కార్యకలాపాలకు, బ్యాంకు దొంగతనాలకు పాల్పడ్డారు. యూపీలోని బిజ్నోర్‌లో జాతన్‌ కాలనీలోని ఓ ఇంట్లో 2014 సెప్టెంబరు 12న బాంబుపేలుడు సంభవించింది. ఆ ఇంట్లో అస్లాం, ఎజాజ్‌, జకీర్‌, అంజాద్‌, సాలిక్‌, మెహబూబ్‌ నివసించేవారు. పోలీసులు అక్కడకు వెళ్లేటప్పటికి వారు పరారయ్యారు. తెలంగాణలో గత ఏడాది ఏప్రిల్‌ 3న జరిగిన ఎన్‌కౌంటర్‌లో అస్లాం, ఎజాజ్‌ హతమయ్యారు. మిగతా నలుగురు తాజా ఎన్‌కౌంటర్‌లో మరణించినవారిలో ఉన్నారు. ఈ నలుగురు తెలంగాణలోని కరీంనగర్‌లో 2014 ఫిబ్రవరి 1న భారీ బ్యాంకు దోపిడీకి పాల్పడ్డారని, అదే ఏడాది మే 1న చెన్నై సెంట్రల్‌ రైల్వే స్టేషన్లో బెంగళూరు-గౌహతి రైలులో పేలుడులో కూడా వీరి హస్తముందని, ఆ ఏడాదే జూలై 10న పుణేలో పేలుళ్లు జరిపారని ఆరోపణలున్నాయి. కాగా.. ఈ సంఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, దీనిపై న్యాయవిచారణ జరిపించాలని కాంగ్రెస్‌ నేతలు దిగ్విజయ్‌సింగ్‌, కమల్‌నాథ్‌, సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ, ఢిల్లీ సీఎం కేజ్రీ డిమాండ్‌ చేశారు. 

నెలలో కూతురి పెళ్లి.. ఈలోపే హెడ్‌కానిస్టేబుల్‌ మృతి
సిమి కార్యకర్తల చేతిలో మరణించిన హెడ్‌ కానిస్టేబుల్‌ రమాశంకర్‌ యాదవ్‌ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఆయన కుమార్తె వివాహం డిసెంబరు 9న జరుగనుంది. దీంతో పెళ్లి పనుల్లో ఆయన బిజీగా ఉన్నారు. రమాశంకర్‌ ఇద్దరు కుమారులు శంభునాథ్‌ (36), ప్రభునాథ్‌ (32) ఆర్మీలో పనిచేస్తున్నారు.
sreek

Super Moderators
Registered:
Posts: 49,871
Reply with quote  #2 

8 మంది సిమి కార్యకర్తల ‘ఎన్‌కౌంటర్’

8 మంది సిమి కార్యకర్తల ‘ఎన్‌కౌంటర్’
 

- భోపాల్ జైలులో సెంట్రీని చంపి పరారైన సిమి కార్యకర్తలు
తర్వాత కొన్ని గంటలకే పోలీసు కాల్పుల్లో హతం


మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోని సెంట్రల్‌ జైలు నుంచి తప్పించుకున్న 8 మంది ‘సిమి’ కార్యకర్తలు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. పటిష్ట భద్రతగల ఈ జైలు నుంచి సిమి(స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా)కి చెందిన 8 మంది ఆదివారం అర్ధరాత్రి దాటాక జైలు సెక్యూరిటీ గార్డును చంపి తప్పించుకున్నారు. ఆ తర్వాత కొన్ని గంటలకే పోలీసులతో ఎదురుకాల్పుల్లో చనిపోయారు. అయితే.. ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌ అని, సిమి కార్యకర్తలను పట్టుకుని కాల్చిచంపారని ఆరోపణలొచ్చాయి. ఎన్‌కౌంటర్‌ తర్వాత సామాజిక మీడియాలో, టీవీ చానళ్లలో ప్రసారమైన  వీడియో క్లిప్‌లో.. నిర్జీవంగా పడివున్న సిమి కార్యకర్తలపైకి అతి సమీపం నుంచి తుపాకీతో కాలుస్తున్న దృశ్యం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.


భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్న 8 మంది ‘సిమి’ కార్యకర్తలు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. పటిష్ట భద్రతగల ఈ జైలు నుంచి సిమి(స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా)కి చెందిన 8 మంది ఆదివారం అర్ధరాత్రి దాటాక జైలు సెక్యూరిటీ గార్డును చంపి తప్పించుకున్నారు. ఆ తర్వాత కొన్ని గంటలకే పోలీసుల ఎదురుకాల్పుల్లో చనిపోయారు. అయితే.. ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని, సిమి కార్యకర్తలను పట్టుకుని కాల్చిచంపారని ఆరోపణలొచ్చాయి. ఎన్‌కౌంటర్ తర్వాత సామాజిక మీడియాలో, టీవీ చానళ్లలో ప్రసారమైన  వీడియో క్లిప్‌లో.. నిర్జీవంగా పడివున్న సిమి కార్యకర్తల శరీరాలపైకి అతి సమీపం నుంచి తపాకీతో బుల్లెట్లు కాలుస్తున్న దృశ్యం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.

సిమి కార్యకర్తలు 8 మంది విచారణ ఖైదీలుగా జైలులో ఒకే సెల్‌లో ఉండేవారని.. ఆదివారం దీపావళి సంబరాల్లో మునిగివున్న సమయంలో అర్ధరాత్రి దాటాక 2-3 గంటల మధ్య వారు సెంట్రీని హతమార్చి జైలు నుంచి తప్పించుకున్నారని భోపాల్ డీఐజీ రామన్‌సింగ్ తెలిపారు. స్పూన్లు, ప్లేట్లను పదునైన ఆయుధాలుగా వాడి ఒక సెంట్రీని కట్టివేసి, మరొక సెంట్రీని చంపేశారని.. తమ దుప్పట్లను తాడుగా కట్టి, దాని సాయంతో జైలు గోడలు ఎక్కి తప్పించుకున్నారని చెప్పారు. ఈ 8 మందిలో ఇద్దరు మూడేళ్ల కిందట ఖాంద్వాలోనూ ఇదేవిధంగా జైలు నుంచి తప్పించుకుని, ఆ తర్వాత పట్టుబడ్డట్లు తెలిపారు.

ఈ ఘటనతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం గాలింపు చేపట్టింది. తప్పించుకున్న వారి ఊహాచిత్రాలను విడుదల చేసి, ఒక్కొక్కరి తలపై రూ. 5 లక్షల చొప్పున రివార్డు ప్రకటించింది. ఆ తర్వాత కొద్ది గంటలకే సెంట్రల్ జైలుకు 10 కిలోమీటర్ల దూరంలోని మాలిఖేదా గ్రామంలో ఈ 8 మందీ దాక్కున్నట్లు స్థానికుల ద్వారా సమాచారం అందిందని.. పోలీసు విభాగానికి చెందిన ఉగ్రవాద వ్యతిరేక బృందం(సీటీజీ), ఉగ్రవాద వ్యతిరేక స్క్వాడ్‌లు సోమవారం ఉదయం వారిని చుట్టుముట్టగా వారు ఎదురుదాడికి దిగారని..  పోలీసులు ఆత్మరక్షణ కోసం వారిని కాల్చిచంపారని డీఐజీ  చెప్పారు. ఉగ్రవాదులు టూత్‌బ్రష్‌లు, చెక్కతో చేసిన తాళంచెవులతో జైలు గదుల తాళాల్ని తెరిచారని చెప్పారు. సిమి కార్యకర్తలు జైలు నుంచి తమ వెంట తెచ్చుకున్న పదునుదేర్చిన స్పూన్లు, ప్లేట్లు వంటి వాటిని పోలీసులపై దాడికి ఉపయోగించారని రాష్ట్ర హోంమంత్రి భూపేంద్రసింగ్ తెలిపారు.  అయితే.. వారు కరడుగట్టిన ఉగ్రవాదులని, సెమీ-ఆటోమేటిక్ తుపాకులు, పదునైన మారణాయుధాలు ఉపయోగించారని, పోలీసులపై కాల్పులు జరిపారని ఐజీ యోగేష్‌చౌదరి తెలిపారు. హోంమంత్రి, ఐజీ ప్రకటనల్లో తేడా ఉండటంతో ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు తలెత్తాయి.

 మృతులపై తుపాకీ కాల్పులు...: ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత టీవీ చానళ్లలో ప్రసారమైన వీడియో దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఎన్‌కౌంటర్ ఘటనకు సంబంధించినదిగా భావిస్తున్న ఆ వీడియోలో.. సిమి కార్యకర్తలు అచేతనంగా నేలపై పడి ఉండగా, వారిపై ఒక పోలీసు.. రైఫిల్‌తో అతి సమీపం నుంచి గురి చూసి కాల్పులు జరుపుతున్న దృశ్యం కనిపించింది. చనిపోయివున్న ఒక వ్యక్తి జేబులో నుండి కొత్తదిగా కనిపిస్తున్న కత్తిని మరొక పోలీసు  బయటకు తీయటం, మళ్లీ అదే స్థానంలో పెట్టేయడం వీడియోలో ఉంది. ‘ఇటువంటి పనులను వీడియో తీస్తారా?’ అని ఓ పోలీసు అనడం కూడా  వినిపించింది.

మరో వీడియోలో.. ఉగ్రవాదులు ఒక రాతిగుట్టపై ఉండగా, వారిని చుట్టుముట్టాలని పోలీసులు చెప్పడం వినిపించింది. ఈ  వీడియోల వాస్తవికత నిర్ధారణ కాకపోయినప్పటికీ.. సిమి కార్యకర్తలను పట్టుకుని కాల్చిచంపేసి, ఎదురుకాల్పుల్లో చనిపోయినట్లు నాటకం అల్లుతున్నారన్న అనుమానాలను బలపరుస్తున్నాయి. అయితే.. వారు ఎదురు కాల్పుల్లోనే చనిపోయారని హోంమంత్రి భూపీందర్‌సింగ్ పునరుద్ఘాటించారు. అది ఎన్‌కౌంటర్ అని, వారిని తుదముట్టించటం మినహా పోలీసులకు ప్రత్యామ్నాయం లేకపోయిందన్నారు.  సిమి ఉగ్రవాదులు జైలు నుంచి తప్పించుకోవడంపై జాతీయ దర్యాప్తు బృందం విచారణ జరుపుతుందని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ చెప్పారు.

 మృతుల వివరాలు ఇవీ...: ఎన్‌కౌంటర్ మృతులను అమ్జాద్, జాకిర్ హుస్సేన్ సాదిక్, మొహమ్మద్ సాలిక్, ముజీబ్ షేక్, మెహ్‌బూద్ గుడ్డు, మొహమ్మద్ కాలిద్ అహ్మద్, అకీల్, మాజిద్‌లుగా గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. వారి నుంచి తుపాకులు, ఇతర మారణాయుధాలతో పాటు, జీపీఎస్ సౌకర్యం గల రిస్ట్ వాచీలు, బెల్టులు, రన్నింగ్ షూస్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వీరు మధ్యప్రదేశ్, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు, బ్యాంకు దోపిడీలు, దొంగతనాలు వంటి నేరాలకు  పాల్పడ్డారన్నారు. సిమి కార్యకర్తలు జైలు నుంచి తప్పించుకున్న ఘటనకు సంబంధించి.. రాష్ట్ర జైళ్ల డీఐజీ, భోపాల్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్, డిప్యూటీ జైల్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ జైల్ సూపరింటెండెండ్‌లను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది.  జైలు నుంచి తప్పించుకోవడంపై  నివేదిక ఇవ్వాలని కేంద్రం రాష్ట్రాన్ని  కోరింది.
 
 సుప్రీం పర్యవేక్షణలో దర్యాప్తు: ఒవైసీ
 ఎన్‌కౌంటర్ వాస్తవికతను నిర్ధారించటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఎఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తప్పుపట్టారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలన్నారు. హోంమంత్రి, పోలీసుల కథనాలు భిన్నంగా ఉన్నందున న్యాయ విచారణ జరపాలని మాజీ సీఎం, కాంగ్రెస్ నేత దిగ్విజయ్ డిమాండ్ చేశారు.
 
 నెలలో కూతురి పెళ్లి..


 భోపాల్: సిమి కార్యకర్తలు భోపాల్ జైలు నుంచి తప్పించుకునేందుకు హత్య చేసిన హెడ్ కానిస్టేబుల్ రమాశంకర్‌యాదవ్ కుమార్తె వివాహం డిసెంబర్ 9వ తేదీన జరగాల్సి ఉంది. ఆయన తన కుమార్తె పెళ్లి ఏర్పాట్లలో తలమునకలై ఉండగా సిమి కార్యకర్తల చేతిలో చనిపోయాడని.. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయిందని ఆయన బంధువులు పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. రమాశంకర్ ఇద్దరు కుమారులు శంభునాథ్ (36) గువాహటిలో, ప్రభునాథ్ (32) హిస్సార్‌లో సైన్యంలో పనిచేస్తున్నారని వివరించారు.
 
 సిమి చరిత్ర ఇదీ
 మొహమ్మద్ అహ్మదుల్లా అధ్యక్షుడిగా ‘సిమి’ 1977లో ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఏర్పాటైంది. మొదట్లో ఇది జమాతే ఇస్లామీ హింద్‌కు విద్యార్థి విభాగం. అమెరికాపై సెప్టెంబర్11 దాడుల తర్వాత అదే నెలలో దీన్ని నిషేధించారు. 2008 ఆగస్ట్‌లో నిషేధాన్ని ఎత్తేసి, భద్రత దృష్ట్యా ఆ ఏడాది మళ్లీ నిషేధం విధించారు. మరో ఐదేళ్లపాటు నిషేధించాలని 2014లో కేంద్రం నిర్ణయించింది. టాడా, మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల చట్టం వంటి చట్టాల కింద సిమి సభ్యులపై కేసులు నమోదయ్యాయి. కొన్నాళ్లకు సిమి పంథాను మార్చుకుని ఉగ్రవాదం బాటపట్టింది. ఉత్తరప్రదేశ్‌లో సిమీకి ఎక్కువ పట్టుంది.
 
 ధార్వాడ టు హైదరాబాద్ వయా భోపాల్!
 సాక్షి, బెంగళూరు: ఎన్‌కౌంటర్ హతుల్లో  ముగ్గురు కొద్దికాలం పాటు కర్ణాటకలోని ధార్వాడాలో ఉన్నట్లు సమాచారం. పోలీసు వర్గాల కథనం ప్రకారం.. అబుల్‌ఫైజల్ గ్యాంగ్ సభ్యులైన ఈ ముగ్గురు 2014లో ధార్వాడ తేజశ్వినీ నగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకున్నారు.  ఈ సమయంలోనే చెన్నై రైల్వేస్టేషన్‌తో పాటు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో పేలుళ్లకు పథకాలు రచించినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి మధ్యప్రదేశ్‌కు చేరి అక్కడ బాంబుపేలుళ్లకు పాల్పడ్డారు. తిరిగి బీదర్‌కు చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్‌కు వెళ్లారు. అక్కడ ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కారు.

sreek

Super Moderators
Registered:
Posts: 49,871
Reply with quote  #3 
sreek

Super Moderators
Registered:
Posts: 49,871
Reply with quote  #4 
[31brk222ab]

[31brk222ac]

[31brk222ad]

sreek

Super Moderators
Registered:
Posts: 49,871
Reply with quote  #5 
8 మంది సిమీ ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్లో హతం 
[31brk222aa]భోపాల్‌: మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ కేంద్ర కారాగారం నుంచి తప్పించుకున్న ఎనిమిది మంది సిమీ ఉగ్రవాదులు హతమయ్యారు. ఆదివారం అర్ధరాత్రి జైలు గార్డును అత్యంత దారుణంగా హతమార్చి ఉగ్రవాదులు తప్పించుకున్నారు. నగర శివారులో వారు తలదాచుకున్నారన్న సమాచారం అందుకున్న యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌(ఏటీసీ) వారిపై ఒక్కసారిగా మెరుపుదాడి చేసి హతమార్చింది.

ప్లేట్‌లు, స్పూన్‌లతో గొంతు కోశారు 
భోపాల్‌కు చెందిన పోలీసు ఉన్నతాధికారి యోగేష్‌ చౌదరి వెల్లడించిన సమాచారం ప్రకారం.. స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా(సిమి)కి చెందిన ఉగ్రవాదులు భోపాల్‌ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి భోపాల్‌ కేంద్ర కారాగారం నుంచి వారు తప్పించుకున్నారు. ఈ క్రమంలో హెడ్‌కానిస్టేబుల్‌ రామశంకర్‌ను ఉగ్రవాదులు అత్యంత దారుణంగా హత్య చేశారు. జైలులో వారికి ఇచ్చిన స్టీల్‌ ప్లేట్‌లు, స్పూన్‌లతో హెడ్‌కానిస్టేబుల్‌ గొంతు కోశారు. అనంతరం బెడ్‌ షీట్లను ఒకదానితో ఒకటి కట్టి జైలు గోడలను దాటుకుంటూ బయటకు పారిపోయారు. ఇందుకోసం ముందుగానే ప్రణాళిక రచించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని యోగేష్‌ చౌదరి పేర్కొన్నారు. దీపావళి సందర్భంగా బాణసంచా శబ్దాలు, దట్టమైన పొగ తాము తప్పించుకోవడానికి ఉపయోగపడతాయని ఉగ్రవాదులు భావించారని తెలిపారు.

జైలు నుంచి పారిపోయిన ఉగ్రవాదులు నగర శివారులోని అచార్‌పురా ప్రాంతంలో తలదాచుకున్నట్లు సోమవారం ఉదయం పోలీసులకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన ఏటీసీ, స్థానిక పోలీసులు ఉగ్రవాదులు ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఈ నేపథ్యంలో వారి నుంచి ప్రతిఘటన ఎదురుకావడంతో కాల్పులు జరిపి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతం భోపాల్‌ కేంద్ర కారాగారానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఈ ఘటనపై తాను కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో మాట్లాడానని.. దీనిపై విచారణ బాధ్యతల్ని జాతీయ దర్యాప్తు బృందం(ఎన్‌ఐఏ) బృందానికి అప్పగించాలని కోరినట్లు మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ చెప్పారు. ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని, అందుకే దీనిపై విచారణను జాతీయ దర్యాప్తు బృందానికి అప్పగించాలని కేంద్రాన్ని కోరినట్లు ఆయన వెల్లడించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న భద్రతా సిబ్బందిని అభినందిస్తున్నట్లు చెప్పారు. గ్రామస్థులు కూడా కీలక పాత్ర పోషించారని, ఎప్పటికప్పుడు తమకు సమాచారం ఇచ్చారని మెచ్చుకున్నారు. ఇదెంతో తీవ్రమైన ఘటన అని దర్యాప్తు అనంతరం సేకరించిన ఆధారాలను బట్టి చర్యలు తీసుకుంటామన్నారు.

పోలీసుల కాల్పుల్లో హతమైన ఉగ్రవాదుల్లో ముగ్గురు గతంలో ఖంద్వా జైలు నుంచి తప్పించుకుని పోగా వారిని పోలీసులు పట్టుకుని భోపాల్‌ కేంద్ర కారాగారంలో ఉంచారు. దేశంలో జరిగిన పలు ఉగ్ర చర్యలతో పాటు, బ్యాంకు దోపిడీల్లో వీరి హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

మరోవైపు ఉగ్రవాదులు జైలు నుంచి తప్పించుకుపోవడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ జైలు సూపరింటెండెంట్‌ సహా ముగ్గురు అధికారులను సస్పెండ్‌ చేసింది.

Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.