Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets



Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment  
sreek

Super Moderators
Registered:
Posts: 49,872
Reply with quote  #1 
[636132976872994787]
  • ఉప ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారు
చెన్నై, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి గత 37 రోజులుగా చికిత్స పొందుతున్న తమిళనాడు సీఎం జయలలిత ఓ ముఖ్యమైన పత్రంపై సంతకానికి బదులు వేలిముద్ర వేశారు! రాష్ట్రంలో త్వరలోనే జరగనున్న ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే తరఫున బరిలోకి దిగే అభ్యర్థులను ధ్రువీకరిస్తూ అందించిన బీ ఫారంపై అమ్మ వేలిముద్ర వేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరగనుంది. తంజావూరు, అరవకురిచ్చి తిరుప్పరకుండ్రం నియోజకవర్గాలకు వచ్చే నెల 19న ఉప ఎన్నిక జరగనుంది. ఈ నియోజకవర్గాల్లో అన్నాడీఎంకే అభ్యర్థులు శుక్రవారం నామినేషన్లు వేశారు. ఆ అభ్యర్థుల బీ-ఫారంలపై సీఎం జయ వేలిముద్ర కనిపించింది. ఆ వేలి ముద్ర జయదేనని ధ్రువీకరిస్తూ చెన్నై ప్రభుత్వ ఆసుపత్రి(జీహెచ) ప్రొఫెసర్‌ పి.బాలాజీ, అపోలో ఆసుపత్రి వైద్యుడు బాబు అబ్రహాం సాక్షులుగా సంతకాలు కూడా చేశారు. ఎన్నికల కమిషన నిబంధనల మేరకు గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు ఆ పార్టీకి నేతృత్వం వహిస్తున్న నాయకుల సంతకాలతో బీ ఫారాలను నామినేషనతో జత చేయాలి. ఆ మేరకు అన్నాడీఎంకే అభ్యర్థులు తమ బీ ఫారాలపై పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జయ ఎడమచేతి బొటనవేలిముద్ర వేశారు. ఆమెకు ‘ట్రాక్యోస్టోమీ’ చికిత్స ఇస్తుండడం వల్ల కుడి చేతికి కొన్ని పరికరాలు అమర్చి ఉన్నాయి. దీంతో ఎడమచేతి బొటనవేలి ముద్రను తీసుకున్నట్టు తెలిసింది.
Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.