Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets


Sbdb pays Homage to Sri Akkineni NageswaraRao garu !

Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment  
Bujji96

Avatar / Picture

DoraBabu
Registered:
Posts: 5,783
Reply with quote  #1 
విజ‌య‌నిర్మ‌ల మ‌న‌వ‌డు, సీనియర్ నటుడు న‌రేశ్ కుమారుడు న‌వీన్ విజ‌య్ కృష్ణ‌. మంచి ఎడిట‌ర్‌గా ఇప్ప‌టికే పేరు తెచ్చుకున్నాడు. సినిమా ట్రైల‌ర్ల‌ను, టీజ‌ర్ల‌ను న‌వీన్ ఎడిటింగ్ చేస్తే సినిమాల్లో పాజిటివ్ బ‌జ్ త‌ప్ప‌నిస‌రిగా ఉంటుంద‌నేది హీరో మ‌హేశ్‌బాబు న‌మ్మ‌కం కూడా. ఎడిట‌ర్‌గా మంచి ఊపు మీదున్న నవీన్‌కి హీరో కావాల‌నే కోరిక పుట్టింద‌ట‌. దాంతో 130 కిలోలున్న ఆయ‌న స‌గానికి త‌గ్గారు. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా న‌వీన్ చేసిన తొలి చిత్రం కొన్ని కారణాల వల్ల ఇంకా విడుద‌ల కాలేదు. అంత‌లో ఆయ‌న న‌టించిన రెండో చిత్రం `నందిని న‌ర్సింగ్ హోమ్` ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. న‌వీన్ విజ‌య‌కృష్ణ ఈ చిత్రంలో ఎలా చేశాడు? నాన‌మ్మ‌, తండ్రి బాట‌లో న‌ట‌న‌కు న్యాయం చేయగలిగాడా? ఓ లుక్కేసేయండి మ‌రి.
 
క‌థ‌
చంద్ర‌శేఖ‌ర్ అలియాస్ చందు (న‌వీన్ విజ‌య‌కృష్ణ‌) ఓ మ‌ధ్య త‌ర‌గ‌తి కుర్రాడు. వైజాగ్‌లో బ్యాంకులో రిక‌వ‌రీమెన్‌గా సేల్స్ విభాగంలో ప‌నిచేస్తుంటాడు. ప‌క్క‌నే ఉన్న గ‌ర్ల్స్ హాస్ట‌ల్ నుంచి వ‌స్తున్న స్వీట్ వాయిస్ విని ప్రేమ‌లో ప‌డుతాడు. ఆమె అమూల్య (శ్రావ్య‌) అని తెలుసుకుంటాడు. పైసామే ప‌ర‌మాత్మ అని న‌మ్ముతుంటుంది అమూల్య‌. బంధాలు అన్నిటిక‌న్నా గొప్ప‌వ‌న్న‌ది చందు న‌మ్మ‌కం. ఇద్ద‌రూ ఒక‌రినొక‌రు ప్రేమించ‌కుంటారు. కానీ ఓ రోజు అమూల్య తండ్రి ఫోన్ చేసి ఏడాదికి రూ.18ల‌క్ష‌లు సంపాదించే కుర్రాడి సంబంధం వ‌చ్చింద‌ని చెబుతాడు.
 
అప్పుడు అమూల్య ఎటు మొగ్గింది? ప్రేమించిన వాడిని కావాల‌నుకుందా? లేక తండ్రి మాట విని వెళ్లిందా? అనేది ఆస‌క్తిక‌రం. మ‌రోవైపు నందిని న‌ర్సింగ్ హోమ్‌లో డాక్ట‌ర్‌గా చేరుతాడు చందు. అక్క‌డ కొన్ని అంతుబ‌ట్ట‌ని చ‌ర్య‌లు జ‌రుగుతుంటాయి. నందిని న‌ర్సింగ్ హోమ్ అధినేత కుమార్తె నందిని ఇత‌న్ని ప్రేమిస్తుంది. ఆ త‌ర్వాత ఏమైంది అనేది ఆస‌క్తిక‌రం. చందు డాక్ట‌ర్ ఎలా అయ్యాడు? న‌ందిని న‌ర్సింగ్ హోమ్‌లో జ‌రిగిన మిస్ట‌రీలు ఏంటి? డాక్ట‌ర్ వెంక‌టేశ్వ‌ర్లు (జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి) జాత‌కాల పిచ్చి ఎలాంటిది? చ‌ందు అమూల్య‌ను చేసుకున్నాడా? నందిని ప్రేమ ఏమైంది? ఆసుప‌త్రిలో నెల‌కు రూ.ల‌క్ష‌ను చెల్లించి రూమ్‌ను అద్దెకు తీసుకుని స‌ప్త‌గిరి పెట్టిన బిజినెస్ ఏంటి? అనేది ఆస‌క్తిక‌రం.
 
ప్ల‌స్ పాయింట్లు
న‌వీన్ విజ‌య‌కృష్ణ‌కి ఇది ప్రాక్టిక‌ల్‌గా రెండో చిత్ర‌మే అయినా విడుద‌లైన తొలి చిత్రం. .బాగా న‌టించాడు. హీరోయిన్లు త‌మ పాత్ర‌ల్లో బాగానే చేశారు. డ‌బ్బుకు ప్రాధాన్య‌త ఇచ్చే పాత్ర‌లో శ్రావ్య చ‌క్క‌గా ఒదిగిపోయింది. ఆమె తండ్రిగా త‌మిళ న‌టుడు జె.పి, స్నేహితుడుగా సంజయ్ త‌మ పాత్ర‌లతో మెప్పించారు.. ష‌క‌ల‌క శంక‌ర్‌కి మాత్రం ఈ సినిమా ఒక ట‌ర్నింగ్ పాయింట్ అవుతుంది. ఆద్యంతం త‌న‌దైన శైలిలో డైలాగులు చెబుతూ న‌వ్విస్తూనే ఉన్నాడు. స‌ప్త‌గిరి క్యార‌క్ట‌ర్‌ను ఎవ‌రూ ఊహించ‌రు. వెన్నెల‌ కిశోర్ పాత్ర కూడా న‌వ్వులు కురిపిస్తుంది. స్క్రీన్‌ప్లే రాసుకున్న విధానం బావుంది. రెగ్యుల‌ర్ హార‌ర్ చిత్రాల‌కు భిన్నంగా ఉంది. ఎడిటింగ్‌, కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తాయి. నిన్నే నిన్నే అనే పాట విన‌సొంపుగా అనిపిస్తుంది.
 
మైన‌స్ పాయింట్లు
రీరికార్డింగ్ హార‌ర్ ప‌రంగా బానే ఉంటుంది కానీ మిగిలిన స‌న్నివేశాల్లో పేల‌వంగా అనిపిస్తుంది. హీరోయిన్ నిత్య యాక్టింగ్ ప‌రంగా ఓకే కానీ, చూడ‌గానే హీరోయిన్ మెటీరియ‌ల్ అనిపించ‌దు. ఒక్క న‌వీన్ త‌ప్ప మిగిలిన వారెవరు సెంటిమెంట్ సీన్స్‌ను పండించలేకపోయారు. అమూల్య తల్లిదండ్రుల్ని చూస్తే సినిమాల్లో రైతుల‌కు సంబంధించిన ప్ర‌క‌ట‌న‌ల‌ను చూసిన ఫీలింగ్ వ‌స్తుందే త‌ప్ప సహజంగా అనిపించ‌దు.
 
స‌మీక్ష‌
హీరోగా నిల‌దొక్కుకోవాల‌నే త‌ప‌న న‌వీన్‌లో క‌నిపించింది.మ‌ధ్య త‌ర‌గ‌తి సేల్స్ మెన్‌గా, న‌ర్సింగ్ హోమ్‌లో డాక్ట‌ర్‌గా, ఎదుటివారికి సాయ‌ప‌డాల‌న్న మ‌న‌స్త‌త్వం కలిగిన కుర్రాడిగా న‌వీన్ బాగా చేశాడు. ఈ సినిమాలో అత‌ని న‌ట‌న‌కు ప్రాధాన్య‌ముంది. ఫైట్లు, డ్యాన్సులు చూపించ‌లేదు. నారా రోహిత్ ఎన్నుకునే త‌ర‌హా స‌బ్జెక్ట్ చిత్రాల‌కు న‌వీన్ చక్క‌గా స‌రిపోతాడ‌నిపించింది. న‌ట‌న‌లో ఎక్కడా బెరుకు లేదు. డ‌బ్బింగ్ కూడా స్ప‌ష్టంగా ఉంది. త‌న పాత్ర‌కు వంద శాతం న్యాయం చేశాడు ద‌ర్శ‌కుడు స్క్రీన్‌ప్లేను గ్రిప్పింగ్‌గా రాసుకున్నారు. కార్పొరేట్ ఆసుప‌త్రిలో జ‌రుగుతున్న అన్యాయాల‌ను చూపిస్తూనే, మ‌రోవైపు క‌న్న పిల్ల‌ల‌పై త‌ల్లిదండ్రుల‌కు ఎలాంటి ప్రేమ ఉంటుంది? ఆ ప్రేమ‌తో వాళ్లు ఎంత‌ వరకూ వెళతారు? అనే  విష‌యాన్నీ చూపించారు. అక్క‌డ‌క్క‌డా కొన్ని షాట్‌లు మిన‌హాయిస్తే సినిమా మొత్తం హాయిగా సాగుతున్న‌ట్టు అనిపిస్తుంది. అన్నిటికీ మించి సినిమాలో అడుగ‌డుగునా ఉన్న కామెడీ ప్రేక్ష‌కుల‌కు రిలీఫ్ నిస్తుంది. స‌మ‌యం గ‌డ‌వ‌డం తెలియ‌కుండా చివ‌రిగా మంచి ట్విస్ట్‌తో సినిమాను పూర్తి చేశారు.
 
బాట‌మ్ లైన్‌: `నందిని న‌ర్సింగ్ హోమ్‌` ఆస‌క్తిక‌రం
రేటింగ్‌: 3/5
sreek

Super Moderators
Registered:
Posts: 49,871
Reply with quote  #2 
Good.. Small movies hit movie aithe
Ghattamaneni

Mahesh Dravid Chai
Registered:
Posts: 5,397
Reply with quote  #3 
Good ..
khandada

Avatar / Picture

khan tho games vaddu
Registered:
Posts: 19,902
Reply with quote  #4 
'నందిని నర్సింగ్ హోం' రివ్యూ

నటీనటులు: నవీన్ విజయ్ కృష్ణ-నిత్య-శ్రావ్య-జయప్రకాష్-జయప్రకాష్ రెడ్డి-సంజయ్ స్వరూప్-వెన్నెల కిషోర్-షకలక శంకర్-సప్తగిరి తదితరులు

సంగీతం: అచ్చు

ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర

నిర్మాతలు: రాధాకిషోర్-బిక్షమయ్య

కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: పి.వి.గిరి

తెలుగు తెరపైకి మరో కొత్త హీరో వచ్చాడు. సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ ‘నందిని నర్సింగ్ హోం’తో కథానాయకుడిగా పరిచయమయ్యాడు. దీని దర్శకుడు.. నిర్మాతలు కూడా కొత్త వాళ్లే. వీళ్లంతా కలిసి చేసిన ఈ ప్రయత్నం ఎలా ఉందో.. నవీన్ అరంగేట్రంలో ఎలాంటి ముద్ర వేశాడో చూద్దాం పదండి.

కథ: చంద్రశేఖర్ అలియాస్ చందు (నవీన్ విజయ్ కృష్ణ) ఎంకామ్ చదివి ఉద్యోగం లేక ఇబ్బంది పడుతుంటాడు. తప్పనిసరి పరిస్థితుల్లో తాను ఎంబీబీఎస్ చదివానని చెప్పుకుని నందిని నర్సింగ్ హోం అనే హాస్పిటల్లో వైద్యుడిగా చేరతాడు. అక్కడ కాంపౌండర్ గా పని చేసే స్నేహితుడి సాయంతో ఎలాగోలా నెట్టుకొస్తుంటాడు. ఆ హాస్పిటల్ యజమాని అయిన నందిని (నిత్య) అతణ్ని ఇష్టపడుతుంది. ఐతే గతంలో అమూల్య (శ్రావ్య) అనే అమ్మాయితో ప్రేమలో ఎదురైన చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని నందినికి కొంచెం దూరంగా ఉంటాడు చందు. ఇదిలా ఉంటే చందు చేసిన తప్పిదం కారణంగా ఒక ప్రాణమే పోతుంది. దీనికి తోడు నందిని నర్సింగ్ హోంలో కొన్ని అనూహ్య పరిణామాలు జరుగుతాయి. ఇంతకీ చందు ఏం తప్పు చేశాడు.. హాస్పిటల్లో తెర వెనుక ఏం జరుగుతుంటుంది.. అమూల్యతో అతడి గతమేంటి.. నిత్యతో చందు వ్యవహారం ఎక్కడిదాకా వెళ్లింది.. అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: కొంచెం బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి ఒక కొత్త హీరో వస్తున్నాడంటే అతణ్ని మాస్ హీరోగా ప్రొజెక్ట్ చేయడానికి మసాలాలన్నీ వేసి కథలు తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఇమేజ్ తో సంబంధం లేకుండా హీరో బిల్డప్పులు.. ఇంట్రడక్షన్ సాంగ్.. డ్యాన్సింగ్ టాలెంట్ చూపించే పాటలు.. భారీ ఫైట్లు.. ఇలాంటి తతంగం చాలా ఉంటుంది. నవీన్ అరంగేట్ర సినిమా విషయంలో ఇలాంటివేమీ లేకుండా ఒక సింపుల్ కథను సింపుల్ గా చెప్పడానికి ప్రయత్నించినందుకు.. నవీన్ ను కేవలం ఒక ‘నటుడి’గా పరిచయం చేయాలని చూసినందుకు ముందు ‘నందిని నర్సింగ్ హోం’ టీంను అభినందించాలి.

‘నందిని నర్సింగ్ హోం’ ఎక్కడా ఓవర్ ద బోర్డ్ వెళ్లకుండా సింపుల్ గా సాగిపోయే ఒక ఎంటర్టైనర్. లాజిక్ గురించి పెద్దగా పట్టించుకోకుండా.. ప్రేక్షకుడి బుర్రకు మరీ పరీక్షలేమీ పెట్టకుండా టైంపాస్ చేయిస్తూ సాగిపోయే కథ ఇది. కథ మరీ గొప్పగా ఏమీ ఉండదు. కథనంలో అంత బిగి కూడా కనిపించదు. కానీ చాలా వరకు బోర్ కొట్టించకుండా టైంపాస్ చేయించేయడంలో మాత్రం ఈ సినిమా విజయవంతమైంది. ఈ విషయంలో కామెడీ ప్రధాన పాత్ర పోషించింది. ఇందులో హార్రర్.. సస్పెన్స్ ఉన్నప్పటికీ.. వాటి మీద పెద్దగా ఫోకస్ పెట్టలేదు. ప్రధానంగా కథనాన్ని కామెడీతో నడిపించే ప్రయత్నమే చేశాడు కొత్త దర్శకుడు పి.వి.గిరి. కొన్ని చోట్ల అవసరానికి మించి కామెడీ మీద ఆధారపడటం వల్ల కథ పక్కదోవ పట్టినట్లు అనిపించినా.. సినిమాకు మాత్రం ప్రధాన ఆకర్షణ ఆ కామెడీనే.

ఓవైపు పోలీసులకు భయపడి కోమాలో ఉన్నవాడిగా నటిస్తూ హాస్పిటల్లో చేరే దొంగగా వెన్నెల కిషోర్.. మరోవైపు హాస్పిటల్లో గది తీసుకుని అక్కడే ‘బిజినెస్’ నడిపించే జగత్ కంత్రీగా సప్తగిరి.. ఇంకోవైపు కన్నింగ్ కాంపౌండర్ గా సప్తగిరి.. ఈ ముగ్గురినీ దర్శకుడు సరిగ్గా వాడుకుని కామెడీ బండిని లాగించేశాడు. హీరో నవీన్ కూడా వాళ్లలో ఒకడిగా మారిపోయి కామెడీ పండించడానికి సిన్సియర్ ఎఫర్టే పెట్టాడు. దీంతో సినిమాలో రెండు అర్ధాల్లోనూ కామెడీకి ఢోకా లేకపోయింది. ముఖ్యంగా నవీన్-సప్తగిరి-వెన్నెల కిషోర్ కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు హిలేరియస్ గా సాగుతాయి.

హీరో ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీలో అంత విశేషం ఏమీ లేదు కానీ.. అది కూడా పెద్దగా ఇబ్బంది పెట్టదు. అది అబ్ రప్ట్ గా ఎండ్ అయిన ఫీలింగ్ కలుగుతుంది కానీ.. దానికి చివర్లో జస్టిఫికేషన్ ఇచ్చాడు దర్శకుడు. ఐతే వర్తమానంలోకి వచ్చేసరికి కామెడీలో పడి దర్శకుడు అసలు కథను సరిగా నడిపించలేకపోయాడు. ఇంటర్వెల్ దగ్గర సీరియస్ టర్న్ తీసుకునే కథను ఆ తర్వాత బిగితో నడిపించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. అంత సీరియస్ విషయం జరిగాక దాని తాలూకు టెంపోను ఆ తర్వాత కొనసాగించలేదు. హీరో చేసిన తప్పు వల్ల ఒక డాక్టర్ అనూహ్యంగా చనిపోతే అతడికేమైందన్నది పోస్టుమార్టం రిపోర్టులో తెలియకుండా ఉంటుందా?

ఐతే ఎంబీబీఎస్ చదవని కుర్రాడు హాస్పిటల్లో డాక్టర్ గా కంటిన్యూ అయిపోవడం అన్నదాంట్లోనే లాజిక్ లేదు కాబట్టి.. మిగతా విషయాలు ఎలా ఉన్నా పర్వాలేదు.. లైట్ అన్నట్లుగా దర్శకుడు కథను నడిపించేశాడు. కథనం పరంగా ప్రథమార్ధంలో కనిపించిన వేగం ద్వితీయార్ధంలో ఉండదు. కథ పాకాన పడాల్సిన టైంలోనూ దర్శకుడు కామెడీనే నమ్ముకున్నాడు. పైగా లెంగ్త్ కూడా ఎక్కువైపోవడంతో ద్వితీయార్ధం గాడి తప్పింది. హీరోకు నిజం తెలిశాక చకచకా సినిమాను ముగించకుండా సాగదీశారు. ప్రి క్లైమాక్సులో వచ్చే పాట అనవసరం.  క్లైమాక్స్ ట్విస్టు థ్రిల్లింగ్ గానే ఉంది కానీ.. దాన్ని ఎవరు ఎలా రిసీవ్ చేసుకుంటారో చెప్పలేం. నిజానికి ఈ కథకు అలాంటి ముగింపు ఉంటుందని ఊహించలేం. ఓవరాల్ గా చూస్తే ‘నందిని నర్సింగ్’ లోపాలున్నప్పటికీ వాటిని కప్పిపుచ్చే వినోదం టైంపాస్ చేయించేస్తుంది. 

నటీనటులు: ‘నందిని నర్సింగ్ హోం’ సినిమాలాగే నవీన్ కూడా సింపుల్ గా ఉన్నాడు. కథాకథనాల పరంగానే కాక నవీన్ నటన పరంగా చూసినా ఇది అతడి తొలి సినిమా లాగా అనిపించదు. రెగ్యులర్ గా సినిమాలు చేస్తున్నవాడిలా ఈజ్ చూపించాడు. పాత్రలో సులభంగా ఒదిగిపోయాడు. కొన్ని సన్నివేశాల్లోనే అతడికి.. అతడి నటనకు అలవాటు పడిపోతాం. ఇంట్రడక్షన్లో కానీ.. సినిమాలో మరెక్కడా కానీ.. కొత్త హీరోకిచ్చే బిల్డప్పుల కోసం ప్రయత్నించకపోవడంలోనే అతను ఆకట్టుకుంటాడు. లుక్స్ ఏవరేజే కానీ.. నవీన్ నటన మాత్రం మెప్పిస్తుంది. హీరోయిన్లు సినిమాకు ఆకర్షణ కాలేకపోయారు. హీరోను డామినేట్ చేయకూడదనుకున్నారో ఏమో.. గ్లామర్ విషయంలో ఇద్దరూ వీక్ హీరోయిన్లనే పెట్టారు. శ్రావ్య.. నిత్య లుక్స్ పరంగా పూర్. నటన పర్వాలేదు. వెన్నెల కిషోర్.. సప్తగిరి.. షకలక శంకర్ ముగ్గురూ తమ పాత్రలకు న్యాయం చేశారు. వాళ్ల కామెడీ టైమింగ్ కు తగ్గట్లుగా పాత్రల్ని తీర్చిదిద్దడంతో బాగా నవ్వించారు. జయప్రకాష్.. జయప్రకాష్ రెడ్డి పాత్రలకు తగ్గట్లుగా నటించారు.

సాంకేతికవర్గం: అచ్చు సంగీతం ఓకే. నిన్నే చూస్తున్నా.. బ్యాగ్రౌండ్ స్కోర్లో వాడుకున్ థీమ్ మ్యూజిక్ బాగున్నాయి. మిగతా పాటలు పర్వాలేదు. నేపథ్య సంగీతంలో కొన్నిచోట్ల అనవసర హంగామా ఎక్కువైంది. దాశరథి శివేంద్ర ఛాయాగ్రహణం ఏవేరేజ్. కథ ఇక్కడే సాగుతోంది అని చెప్పడానికి పదే పదే నర్సింగ్ హోం లాంగ్ షాట్ చూపించడం లాంటివి అనవసరం అనిపిస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఏమంత గొప్పగా లేవ. తక్కువ ఖర్చులో.. పరిమితమైన లొకేషన్లలో సినిమాను ముగించేశారు. పి.వి.గిరి దర్శకుడిగా ప్రత్యేకమైన ముద్ర వేయలేదు కానీ.. సినిమాను బాగానే డీల్ చేశాడు. ముఖ్యంగా కామెడీ విషయంలో అతడికి పట్టుందన్న సంగతి చాలా సన్నివేశాల్లో తెలుస్తుంది. కామెడీ సీన్స్ చూస్తే దర్శకుడు కొత్త వాడన్న అభిప్రాయమే కలగదు. స్క్రీన్ ప్లే విషయంలో మరింత కసరత్తు చేయాల్సింది. కథనంలో బిగి లేదు. ఐతే ఒక కొత్త హీరోను పెట్టుకుని ఈ కథతో టైంపాస్ చేయించినందకు అతను అభినందించవచ్చు.

చివరగా: నందిని నర్సింగ్ హోం.. టైంపాస్ చేయిస్తుంది

రేటింగ్- 2.75/5
Trivikram_fan

Avatar / Picture

MotoG Rocksssss
Registered:
Posts: 16,942
Reply with quote  #5 
123telugu gave 3.25
cinemapichodu

Avatar / Picture

Relangi Mamayya
Registered:
Posts: 79,813
Reply with quote  #6 
Quote:
Originally Posted by Trivikram_fan
123telugu gave 3.25
adhi ivakapote news kaani iste news enti [biggrin] 

__________________
manaki telisindhi cinema cinema cinema
viswanath

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 124,986
Reply with quote  #7 
aa roje chepthe kindalling chesaru eeda andharu..kurrodu parledhu bagane chesadu ante trailer chusi...[mad]
cinemapichodu

Avatar / Picture

Relangi Mamayya
Registered:
Posts: 79,813
Reply with quote  #8 
: Amateurish treatment! A ghost story that relies more on comedy track of Vennela Kishore, Shakalaka Shankar & Saptagiri.
__________________
manaki telisindhi cinema cinema cinema
Trivikram_fan

Avatar / Picture

MotoG Rocksssss
Registered:
Posts: 16,942
Reply with quote  #9 
show time
Trivikram_fan

Avatar / Picture

MotoG Rocksssss
Registered:
Posts: 16,942
Reply with quote  #10 
Quote:
Originally Posted by Trivikram_fan
show time


Ok first half.. Vennela kishore, shakalaka shankar la comedy baagundhi
viswanath

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 124,986
Reply with quote  #11 
Quote:
Originally Posted by Trivikram_fan
Ok first half.. Vennela kishore, shakalaka shankar la comedy baagundhi


ma voorlo lepesadu..veldham anukunte..movie bagundi ananru
Indian_Cinema_Fan

Avatar / Picture

Admin
Registered:
Posts: 74,514
Reply with quote  #12 
Quote:
Originally Posted by viswanath


ma voorlo lepesadu..veldham anukunte..movie bagundi ananru

naaku baane anipinchindi
Trivikram_fan

Avatar / Picture

MotoG Rocksssss
Registered:
Posts: 16,942
Reply with quote  #13 
Quote:
Originally Posted by Trivikram_fan


Ok first half.. Vennela kishore, shakalaka shankar la comedy baagundhi


climax ki vasthunnaa koddhi drag ayinaa koodaa, 2nd half parledhu.. total ga ok mvi.. easy ga chudochu..

Naveen baagaa chesaadu.. kontha mandhi debute mvis kante chalaa better acting [thumb]
Trivikram_fan

Avatar / Picture

MotoG Rocksssss
Registered:
Posts: 16,942
Reply with quote  #14 
Quote:
Originally Posted by viswanath


ma voorlo lepesadu..veldham anukunte..movie bagundi ananru


2nd week lo nizam motham lo hyd lo moodu show lo, disctricts lo oka theatre lo vundhi.. maree aa range mvi assalu kaadhu.. manchi relz raavaksindhi [frown]
sreek

Super Moderators
Registered:
Posts: 49,871
Reply with quote  #15 
Movie baagunda?
viswanath

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 124,986
Reply with quote  #16 
Quote:
Originally Posted by Trivikram_fan


climax ki vasthunnaa koddhi drag ayinaa koodaa, 2nd half parledhu.. total ga ok mvi.. easy ga chudochu..

Naveen baagaa chesaadu.. kontha mandhi debute mvis kante chalaa better acting [thumb]


Hero baga chesadu anta..papam bad luck..
megasuperfan

DoraBabu
Registered:
Posts: 5,245
Reply with quote  #17 
print vachinda :run
Neela

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 29,901
Reply with quote  #18 
Movie bagundi...first half lo hospital comedy scenes too good..
TEMPER

Avatar / Picture

Super Moderators
Registered:
Posts: 52,503
Reply with quote  #19 
[biggrin]
__________________
Tarak Fan
cinemapichodu

Avatar / Picture

Relangi Mamayya
Registered:
Posts: 79,813
Reply with quote  #20 
Quote:
Originally Posted by TEMPER
[biggrin]
ee cinema 2nd half report enti ?>? [biggrin]

__________________
manaki telisindhi cinema cinema cinema
TEMPER

Avatar / Picture

Super Moderators
Registered:
Posts: 52,503
Reply with quote  #21 
Quote:
Originally Posted by cinemapichodu
ee cinema 2nd half report enti ?>? [biggrin]

bagundhi anta  kadha 

__________________
Tarak Fan
cinemapichodu

Avatar / Picture

Relangi Mamayya
Registered:
Posts: 79,813
Reply with quote  #22 
Quote:
Originally Posted by TEMPER

bagundhi anta  kadha 
Nenu choodaleud.. general ga nuvu cheptuntav ga 2nd half report anduku adiga.

__________________
manaki telisindhi cinema cinema cinema
Indian_Cinema_Fan

Avatar / Picture

Admin
Registered:
Posts: 74,514
Reply with quote  #23 
good film,cinemapichhodu ane id pettukuni chinna cinemalani encourage cheyakunda choosinde padi saarlu choose ilaantollu vunte inkem aadathaay ilaantivi [frown]
cinemapichodu

Avatar / Picture

Relangi Mamayya
Registered:
Posts: 79,813
Reply with quote  #24 
Quote:
Originally Posted by Indian_Cinema_Fan
good film,cinemapichhodu ane id pettukuni chinna cinemalani encourage cheyakunda choosinde padi saarlu choose ilaantollu vunte inkem aadathaay ilaantivi [frown]
trailer/promotions lo edanan interesting anipinchali edanna interest undali, em ledu aa hero asale nacchaledu so vellaledu simple..

__________________
manaki telisindhi cinema cinema cinema
Indian_Cinema_Fan

Avatar / Picture

Admin
Registered:
Posts: 74,514
Reply with quote  #25 
cinemapichhodu id should be given to movie lover trivikram_fan,chinna cinema aina sare bavundi anthe ekkadi nundi ekkadi daaka aina velli choososthaadu [thumb]
viswanath

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 124,986
Reply with quote  #26 
Quote:
Originally Posted by Indian_Cinema_Fan
good film,cinemapichhodu ane id pettukuni chinna cinemalani encourage cheyakunda choosinde padi saarlu choose ilaantollu vunte inkem aadathaay ilaantivi [frown]


choosina cinemale 5 or 6 times chusthadu..ilanti vaatini encourage cheyakunda
firakiahs

Registered:
Posts: 930
Reply with quote  #27 
Quote:
Originally Posted by Indian_Cinema_Fan
good film,cinemapichhodu ane id pettukuni chinna cinemalani encourage cheyakunda choosinde padi saarlu choose ilaantollu vunte inkem aadathaay ilaantivi [frown]
delete that id sir aa name pettukone arhata kolpoyadu CP
viswanath

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 124,986
Reply with quote  #28 
Quote:
Originally Posted by Indian_Cinema_Fan
cinemapichhodu id should be given to movie lover trivikram_fan,chinna cinema aina sare bavundi anthe ekkadi nundi ekkadi daaka aina velli choososthaadu [thumb]


varun anna rocks i say..change id
Indian_Cinema_Fan

Avatar / Picture

Admin
Registered:
Posts: 74,514
Reply with quote  #29 
Quote:
Originally Posted by viswanath


choosina cinemale 5 or 6 times chusthadu..ilanti vaatini encourage cheyakunda

+1
viswanath

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 124,986
Reply with quote  #30 
Quote:
Originally Posted by arif
delete that id sir aa name pettukone arhata kolpoyadu CP


+1
cinemapichodu

Avatar / Picture

Relangi Mamayya
Registered:
Posts: 79,813
Reply with quote  #31 
Quote:
Originally Posted by arif
delete that id sir aa name pettukone arhata kolpoyadu CP
aaha ..ohoo..

__________________
manaki telisindhi cinema cinema cinema
cinemapichodu

Avatar / Picture

Relangi Mamayya
Registered:
Posts: 79,813
Reply with quote  #32 
ippuud kooda aa RP Patnaik movie choodanu.. sundauy choosina cinemale malli chosota like dharmayogi or premam..
__________________
manaki telisindhi cinema cinema cinema
Indian_Cinema_Fan

Avatar / Picture

Admin
Registered:
Posts: 74,514
Reply with quote  #33 
Quote:
Originally Posted by viswanath


+1
+1 change chesedaama 
Indian_Cinema_Fan

Avatar / Picture

Admin
Registered:
Posts: 74,514
Reply with quote  #34 
Quote:
Originally Posted by cinemapichodu
ippuud kooda aa RP Patnaik movie choodanu.. su dasjndauy choosina cinemale malli chosota like dharmayogi or premam..
siggu eggu vunte ga manalo okkadu bavunna adodilesi premam dharmayogi aa 
cinemapichodu

Avatar / Picture

Relangi Mamayya
Registered:
Posts: 79,813
Reply with quote  #35 
Quote:
Originally Posted by Indian_Cinema_Fan
siggu eggu vunte ga manalo okkadu bavunna adodilesi premam dharmayogi aa 
thutt. naku interest unte elta lekunte ledu.. cinema relase ki mundu bagundi ani ela telusu..

broker torture chaalu ee jeevitaniki, hero vere ye jaggu or Rajendra prasad aite def ga chosetonni [smile] 

__________________
manaki telisindhi cinema cinema cinema
viswanath

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 124,986
Reply with quote  #36 
Quote:
Originally Posted by cinemapichodu
ippuud kooda aa RP Patnaik movie choodanu.. sundauy choosina cinemale malli chosota like dharmayogi or premam..


inka premam aa,,dharma yogi rendava saaraa..nuvvu devudivi saami
viswanath

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 124,986
Reply with quote  #37 
Quote:
Originally Posted by Indian_Cinema_Fan
siggu eggu vunte ga manalo okkadu bavunna adodilesi premam dharmayogi aa 


manolo okadu hit avuddhi
cinemapichodu

Avatar / Picture

Relangi Mamayya
Registered:
Posts: 79,813
Reply with quote  #38 
Quote:
Originally Posted by viswanath


inka premam aa,,dharma yogi rendava saaraa..nuvvu devudivi saami
eeroju naruda donaruda choostunna ratriki [smile] 

__________________
manaki telisindhi cinema cinema cinema
Indian_Cinema_Fan

Avatar / Picture

Admin
Registered:
Posts: 74,514
Reply with quote  #39 
Quote:
Originally Posted by viswanath


manolo okadu hit avuddhi
ivaala sumanth di repu manalo okkadu choostha
Indian_Cinema_Fan

Avatar / Picture

Admin
Registered:
Posts: 74,514
Reply with quote  #40 
Quote:
Originally Posted by viswanath


inka premam aa,,dharma yogi rendava saaraa..nuvvu devudivi saami

akkineni fan kada common le
tomato_bajji

Avatar / Picture

Soggadu
Registered:
Posts: 6,317
Reply with quote  #41 
Quote:
Originally Posted by cinemapichodu
thutt. naku interest unte elta lekunte ledu.. cinema relase ki mundu bagundi ani ela telusu..

broker torture chaalu ee jeevitaniki, hero vere ye jaggu or Rajendra prasad aite def ga chosetonni [smile] 


Broker Nachaleda??Chala manchi Movie...Chinna movies dani kante inkem untayi..
cinemapichodu

Avatar / Picture

Relangi Mamayya
Registered:
Posts: 79,813
Reply with quote  #42 
Quote:
Originally Posted by tomato_bajji


Broker Nachaleda??Chala manchi Movie...Chinna movies dani kante inkem untayi..
Concept and few scenes like gollapudi vi baguntai anthey, migatanta sarigga undadu cinema.. aa characters/plot ki taggaa manchi scenes padaledu inka self dabba kind of narration and approach. ingo nenu teestunna choodandi goppa cinema annattu.

__________________
manaki telisindhi cinema cinema cinema
Indian_Cinema_Fan

Avatar / Picture

Admin
Registered:
Posts: 74,514
Reply with quote  #43 
 broker super movie,hearing good report for manalo okkadu
Trivikram_fan

Avatar / Picture

MotoG Rocksssss
Registered:
Posts: 16,942
Reply with quote  #44 
Quote:
Originally Posted by Indian_Cinema_Fan
cinemapichhodu id should be given to movie lover trivikram_fan,chinna cinema aina sare bavundi anthe ekkadi nundi ekkadi daaka aina velli choososthaadu [thumb]


[image] 
viswanath

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 124,986
Reply with quote  #45 
Quote:
Originally Posted by Trivikram_fan


[image] [tongue]
Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.