Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets



Jai SreeRam !!

Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment  
sreek

Super Moderators
Registered:
Posts: 49,835
Reply with quote  #1 

ఏపీ గవర్నర్‌‌కు నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ

[06242020224223n14]

 

అమరావతి: ఏపీ గవర్నర్‌కు నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు. తనకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం టెర్రర్ సృష్టిస్తోందని లేఖలో పేర్కొన్నారు. వెంటనే తమ జోక్యం అవసరమని.. తనను కాపాడాలని రమేష్ కుమార్ కోరారు. హైదరాబాద్ ప్రసన్‌నగర్‌లోని తన ఇంటిపై 24 గంటలు నిఘా పెట్టారని లేఖలో తెలిపారు. ఒక ఫోర్డ్ కార్, రెండు మోటార్ సైకిళ్లపై తనన్ను అనుసరిస్తున్నారని చెప్పారు.

 

లేఖలో నిమ్మగడ్డ రాసిన మరిన్ని అంశాలు: 

‘‘ నా ఫోన్ ట్యాపింగ్‌లో ఉంది. ఈ ఏడాది మార్చి 18న తనకు రక్షణ కల్పించిన కేంద్ర హోంశాఖ కార్యదర్శికి నేను లేఖ రాశా. ఈ లేఖపై కూడా అధికార పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి దర్యాప్తు చేయాలని పోలీసులను కోరారు. ఈ లేఖను నేను రాశానని చెప్పాను. ఇదే విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ శాఖ మంత్రి కూడా ధ్రువీకరించారు. ఈ లేఖపై స్పందించి నాకు రక్షణ కూడా కల్పించారు. ఏపీ సీఐడీ అధికారులు ఎన్నికల కమిషన్ కార్యాలయంలోకి వెళ్లి కంప్యూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. రహాస్య సమాచారాన్ని కూడా తీసుకున్నారు. లేఖను టైప్ చేసిన ఉద్యోగిని కస్టడీలోకి తీసుకున్నారు. ఈ లేఖ బయట తయారు చేస్తున్న ఆరోపణలు సత్యదూరం. నన్ను విజయవాడ, కార్యాలయానికి రానివ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది. కనీసం తన తల్లిని చూసేందుక్కూడా అవకాశం ఇవ్వడంలేదు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి వాణిమోహన్ ఉన్నతాధికారుల ఆదేశాలతో నా ప్రవేశాన్ని అడ్డుకుంటున్నారు. ఏపీ హైకోర్టు నా స్థానాన్ని పునరుద్ధరించాలని తీర్పునిచ్చినా పాత కమిషనర్ కనగరాజ్‌కు ఎన్నికల కమిషనర్ సదుపాయాలు కల్పిస్తున్నారు. ఈ చర్యలన్నీ ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తిని, సమగ్రతను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ఈ దశలో మీ జోక్యం అవసరం. ఎన్నికల కమిషనర్‌గా నన్ను పునరుద్ధరించాలి.’’ అని గవర్నర్‌కు రమేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. 

 

 
sreek

Super Moderators
Registered:
Posts: 49,835
Reply with quote  #2 
కోర్టు ఆదేశాల ధిక్కరణే

  ప్రభుత్వం కావాలనే ఉల్లంఘిస్తోంది
  హైకోర్టులో పూర్వ ఎస్‌ఈసీ రమేశ్‌ కుమార్‌ పిటిషన్‌
  అమ్మను చూసేందుకూ వెళ్లలేకపోతున్నా
  నన్ను అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం పోలీసుల్ని మోహరించింది
  గవర్నర్‌కు రాసిన లేఖలో రమేశ్‌ కుమార్‌ ఫిర్యాదు
ఈనాడు - అమరావతి

కోర్టు ఆదేశాల ధిక్కరణే

రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్వ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ రాష్ట్ర ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ వేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌(ఎస్‌ఈసీ)గా తనను పునర్నియమించాలంటూ ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఉల్లంఘించిందని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన బుధవారం హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి వాణీ మోహన్‌లను ప్రతివాదులుగా చేర్చారు. ‘హైకోర్టు తీర్పును ప్రతివాదులు ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించారు. అది కచ్చితంగా కోర్టు ధిక్కరణే. కోర్టు ధిక్కరణ చట్టంలోని 10, 12 సెక్షన్ల ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలి. ఎస్‌ఈసీగా బాధ్యతలు నిర్వర్తించేందుకు తనను అనుమతించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలి’ అని హైకోర్టుకు రమేశ్‌ కుమార్‌ విజ్ఞప్తి చేశారు. ఎస్‌ఈసీగా జస్టిస్‌ కనగరాజ్‌ నియామక ఉత్తర్వులు చెల్లవని హైకోర్టు స్పష్టంగా చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఆయననే ఎస్‌ఈసీగా పరిగణిస్తోందని తెలిపారు. ‘హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. జోక్యం చేసుకోవడానికి, మధ్యంతర స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కాబట్టి హైకోర్టు తీర్పే ఇప్పటికీ చెల్లుబాటవుతుంది. ఈ ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత మొదటి ప్రతివాదిపై ఉంది’ అని పేర్కొన్నారు.

నా విజ్ఞప్తులను పట్టించుకోలేదు.
‘హైకోర్టు తీర్పు ప్రకారం తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ నెల 11న సీఎస్‌కు ఈ-మెయిల్‌ ద్వారా ఒక లేఖ పంపా. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్‌ఈసీ హోదాలో నేను విజయవాడ వచ్చేందుకు అవసరమైన అనుమతులు, ఏర్పాట్లు చేయాలని వాణీమోహన్‌ను కోరగా, ఆమె అయిష్టత వ్యక్తం చేయడాన్నీ సీఎస్‌కు రాసిన లేఖలో ప్రస్తావించా. ఈ నెల 12న వాణీమోహన్‌కు మరో లేఖ రాశా. నేను ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఆమె పట్టించుకోకుండా  ఇప్పటికీ జస్టిస్‌ కనగరాజ్‌కు అన్ని సదుపాయాలు కొనసాగించడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని తెలిపా. ఈ నెల 15న ఆమెకు మరో లేఖ పంపా. సీఎస్‌ నుంచిగానీ, వాణీమోహన్‌ నుంచి గానీ ఎలాంటి సమాధానం రాకపోడంతో ఈ నెల 18న గవర్నర్‌కు ఫిర్యాదు చేశా’ అని రమేశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ‘హైకోర్టు ఉత్తర్వుల గురించి ప్రతివాదులకు, స్పష్టంగా తెలిసినా ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘిస్తున్నారు. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఎన్నికల సంఘం తరపున వాణీ మోహన్‌ ఈ నెల 18న ఒక రిట్‌ పిటిషన్‌ వేశారు. ద్వివేది వేసిన ఎస్‌ఎల్‌పీని సుప్రీంకోర్టు తిరస్కరించిన తర్వాతా ఇలా చేయడం, ఆమె కుమ్మక్కు, పక్షపాత ధోరణికి నిదర్శనం’ అని రమేశ్‌ కుమార్‌ కోర్టుకు నివేదించారు.

 


వాణిమోహన్‌కు రాసిన లేఖలో..

‘మీరు వ్యవహరిస్తున్న తీరు సరికాదు. హైకోర్టు ఉత్తర్వుల్ని మీరు ధిక్కరిస్తున్నారు. మీ చర్యలవల్ల తలెత్తే పరిణామాలకు వ్యక్తిగతంగా మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మీకు అనుకూలంగా తీసుకునే న్యాయ సలహాలు... రేపు విచారణలో నిలబడాల్సి వచ్చినప్పుడు మీకు రక్షణ కల్పించలేవు. చట్టపరంగా సరైన నిర్ణయాలు తీసుకునేందుకు మీకు పదే పదే అవకాశం ఇచ్చినా వినియోగించుకోలేదు. మీకు ఇదే చివరి అవకాశం. ఇప్పుడూ మీరు విఫలమైతే, తీవ్ర పరిణామాలు తప్పవు’ అని ఆయన వాణీమోహన్‌కు రాసిన లేఖలో తెలియజేశారు. గవర్నర్‌, సీఎస్‌, వాణీమోహన్‌లకు కొద్ది రోజుల క్రితం రాసిన లేఖలను బుధవారం హైకోర్టులో వేసిన పిటిషన్‌కు రమేశ్‌ కుమార్‌ జతచేశారు. వాణీమోహన్‌ ఇచ్చిన ప్రత్యుత్తరాన్ని కూడా ఆయన వాటిలో పొందుపరిచారు.


అమ్మను చూసేందుకూ వెళ్లలేకపోతున్నా..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, పోలీసులు తనను బెదిరించడం, భయకంపితుడిని చేయడం ద్వారా తన విధుల్ని స్వేచ్ఛగా నిర్వహించకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు రాసిన లేఖలో రమేశ్‌ కుమార్‌ ఫిర్యాదు చేశారు. ‘అనారోగ్యంతో విజయవాడలో చికిత్స పొందుతున్న 84 ఏళ్ల నా తల్లిని చూసేందుకూ వెళ్లలేని పరిస్థితిలో ఉన్నా. హైదరాబాద్‌లోని నా ఇంటిపై 24 గంటలూ నిఘా పెట్టారు. వారు నియమించిన మనుషులు ఒక కారు, రెండు మోటార్‌ సైకిళ్లపై నన్ను నిరంతరం నీడలా వెంటాడారు. నా ఫోన్లనూ ట్యాప్‌ చేశారని భావిస్తున్నా. ఈ విషయంలో మీరు తక్షణం జోక్యం చేసుకోవాలి. నాకు ముప్పు ఉందని కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాశా. ఆ తర్వాత నాకు భద్రత పెంచారు. అది ఫోర్జరీ లేఖని, దానిపై పోలీసు దర్యాప్తు జరపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి డీజీపీకి ఒక లేఖ రాశారు. అయితే ఆ లేఖ నేనే రాశానని చెప్పా. నా నుంచి లేఖ అందినట్టు కేంద్ర హోంశాఖ నిర్ధారించింది.. అలాంటప్పుడు అది ఫోర్జరీ అని ఎలా అంటారు..  సీఐడీ పోలీసులు నా కార్యాలయంలో సోదాలు చేశారు. కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌ను తీసుకెళ్లారు. దానిలో కాన్ఫిడెన్షియల్‌ సమాచారం ఉంది. హోంశాఖకు నేను రాసిన లేఖను టైప్‌ చేసిన ఉద్యోగిని నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆ లేఖ బయటి నుంచి వచ్చినట్టుగా చెప్పమని చాలా ఒత్తిడి తెచ్చినా ఆయన నిరాకరించారు. నాకు వ్యతిరేకంగా పెద్ద కుట్ర జరుగుతోందని తెలియడంతో, భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించా. నేను విజయవాడకు, ఎన్నికల సంఘం కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు పెద్ద సంఖ్యలో పోలీసుల్ని మోహరించారు. నేను విజయవాడకు వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడానికీ పై అధికారుల కను సన్నల్లో పని చేస్తున్న ఎన్నికల సంఘం కార్యదర్శి వాణీ మోహన్‌ విముఖంగా ఉన్నారు. నన్ను పునర్నియమించాలని హైకోర్టు ఆదేశించిన తర్వాతా ఆమె నా పరిస్థితిపై న్యాయ సలహా తీసుకుంటున్నట్టు సమాధానమిచ్చారు. ఇలాంటి చర్యలన్నీ ఎన్నికల సంఘం స్వతంత్రతకు, సమగ్రతకు విఘాతం.  నన్ను లక్ష్యంగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్న చట్ట వ్యతిరేక చర్యల్ని నిరోధించండి’  అని గవర్నర్‌కు రాసిన లేఖలో రమేశ్‌ కుమార్‌ విజ్ఞప్తి చేశారు.

Indian_Citizen

Avatar / Picture

Baabu
Registered:
Posts: 3,511
Reply with quote  #3 
Ap vellalante dgp ki kakunda governor ki letter rayalanna mata
Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.