Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets


Sbdb pays Homage to Sri Akkineni NageswaraRao garu !

Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment  
sreek

Super Moderators
Registered:
Posts: 49,871
Reply with quote  #1 
[01tollywood8a]గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి కేంద్ర ప్రభుత్వం 2016కిగాను శతవసంత భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారాన్ని (సెంటినరీ అవార్డు ఫర్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ద ఇయర్‌ 2016) ప్రకటించింది. గోవాలో జరగనున్న భారతీయ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫి) ఉత్సవాల్లో దీన్ని ప్రదానం చేస్తారు. కేంద్ర సమాచార, ప్రసారశాఖల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు మంగళవారం దిల్లీలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. అవార్డుతోపాటు బాలుకి రూ.10 లక్షల నగదు బహుమతి అందజేస్తారు. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకుంటున్న నాలుగో వ్యక్తి ఎస్పీబాలు. ఇదివరకు వహీదారెహమాన్‌, రజనీకాంత్‌, ఇళయరాజాలు దీన్ని స్వీకరించారు. భారతీయ చలనచిత్ర రంగంతో ఆయన అయిదు దశాబ్దాల బంధానికి గుర్తింపుగా ఈ అవార్డు ప్రకటించారు. ‘‘అందరూ బాలూ అని పిలుచుకొనే బాలసుబ్రహ్మణ్యం గురించి తెలియని భారతీయుడు ఉండరు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో 40వేలకు పైగా పాటలుపాడి గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌రికార్డ్స్‌లో స్థానం పొందారు. నాలుగు భాషల నుంచి జాతీయ చలనచిత్ర అవార్డులు పొందారు. లెక్కలేనన్ని రాష్ట్రస్థాయి అవార్డులు స్వీకరించారు. నటుడిగానూ ఎన్నో సినిమాల ద్వారా మెప్పించారు. ఈయన్ను 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్‌ అవార్డులు కూడా వరించాయి’’ అని వెంకయ్యనాయుడు కొనియాడారు.

88 దేశాలకు చెందిన 194 చిత్రాలు: గోవాలో ఈనెల 20 నుంచి 28 వరకు భారతీయ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం జరుగుతుంది. ఇందులో 88 దేశాలకు చెందిన 194 చలనచిత్రాలను ప్రదర్శించనున్నారు. కేంద్ర సమాచార, ప్రసారశాఖల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఈ కార్యక్రమ విశేషాలు వెల్లడించారు. చలన చిత్రోత్సవం ప్రఖ్యాత చిత్రం ‘ఆఫ్టర్‌ ఇమేజ్‌’ ప్రదర్శనతో ప్రారంభం అవుతుంది. ఇఫీ ముగింపు ఉత్సవాలకు దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరవుతారు. సినిమా ప్రదర్శనలే కాకుండా యువకుల నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలూ నిర్వహిస్తారు. ఈసారి కొత్తగా ఉత్తమ తొలి చిత్ర దర్శకుడి అవార్డు అందించబోతున్నారు.

అంతర్జాతీయ పోటీ విభాగంలో ఇండియన్‌ పనోరమా నుంచి రెండు భారతీయ సినిమాలతోపాటు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన 15 సినిమాలు ప్రదర్శిస్తారు. శాంతి, సహనం, అహింస సిద్ధాంతాలను ప్రతిబింబించే చిత్రానికి ‘ఐసీఎఫ్‌టీ-యునెస్కో గాంధీ మెడల్‌’ అందిస్తారు. దివ్యాంగ చిన్నారుల కోసం ప్రత్యేక శ్రవణ సాంకేతిక పరిజ్ఞానంతో మూడు సినిమాలు ప్రదర్శిస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్‌ ఇతివృత్తంతో రూపొందించిన 20 లఘుచిత్రాలను ప్రదర్శిస్తారు.

చిత్ర రూపకర్తలకు ప్రోత్సాహకాలు: ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌, కేన్స్‌ తదితర చిత్రోత్సవాలకు ఎంపికైన భారతీయ చిత్రాల రూపకర్తలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. పోటీలో పాల్గొంటున్న చిత్రాల ప్రచార కార్యక్రమాలకు, చిత్రోత్సవాల్లో పాల్గొనడానికి వెళ్లే చిత్రబృందాల ప్రయాణ, వసతి ఖర్చులు, చిత్ర ప్రదర్శన సంబంధిత విషయాల్లో ప్రభుత్వం సహకారం అందిస్తుందని ఆయన తెలిపారు.

ఆస్కార్‌ పురస్కారాల్లో విదేశీ చిత్రం విభాగంలో పోటీపడే భారతీయ చిత్రాలకు రూ.50లక్షల నుంచి రూ.కోటి వరకు ఇస్తారు. 
కేన్స్‌ చిత్రోత్సవాల్లో ‘ఇన్‌ కాంపిటీషన్‌’ విభాగంలో రూ.20 లక్షలు, ‘అన్‌ సర్టెన్‌ రిగార్డ్‌’ విభాగంలో రూ.15 లక్షలు ఇస్తారు. 
వెనిస్‌ చిత్రోత్సవంలో రూ.15 లక్షలు, టొరంటో చిత్రోత్సవం, బుసాన్‌ చిత్రోత్సవంలోని న్యూ కరెంట్స్‌ విభాగంలో రూ.10 లక్షలు, ఆసియన్‌ సినిమా విభాగంలో రూ.7.5 లక్షలు, లొకార్నో చిత్రోత్సవంలో రూ.7.5లక్షలు ఇస్తారు.

- ఈనాడు, దిల్లీ

బాహుబలి ప్రదర్శన: ‘‘గోవాలో జరిగే చలనచిత్రోత్సవంలో ఇండియన్‌ పనోరమ విభాగంలో ప్రదర్శన నిమిత్తం 240 సినిమాలు రాగా, వాటిలో 25 చిత్రాలు ఎంపికయ్యాయ’’ని ఇండియన్‌ పనోరమ జ్యూరీ సభ్యులలో ఒకరైన దర్శకనిర్మాత సి.వి.రెడ్డి తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ‘‘తెలుగు నుంచి ఆరు సినిమాలు పోటీ పడినా, ఏదీ ఎంపిక కాకపోవడం విచారించదగ్గ విషయం. ‘బాహుబలి’ని పనోరమలో ప్రదర్శిస్తామ’’న్నారు.

Raju225

Abhimanyu
Registered:
Posts: 7,288
Reply with quote  #2 
[thumb]
Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.