Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets


Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment  
sreek

Super Moderators
Registered:
Posts: 49,835
Reply with quote  #1 
ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రుల్లో ఉచితంగా కరోనా చికిత్స

ధరలు ఖరారు చేసిన ప్రభుత్వం
రోజువారీగా చెల్లింపులు
గరిష్ఠం రూ.10,380.. కనిష్ఠం రూ.3,250
వైద్య, ఆరోగ్యశాఖ ఉత్తర్వులు
 ఆసుపత్రులకు రోజువారీ చెల్లింపులు
 గరిష్ఠం రూ.10,380..  కనిష్ఠం రూ.3,250
 వైద్య, ఆరోగ్యశాఖ ఉత్తర్వుల జారీ

ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రుల్లో ఉచితంగా కరోనా చికిత్స

ఈనాడు, అమరావతి: కరోనా వైరస్‌ బాధితులకు ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ (ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో) ఉచితంగా చికిత్స అందనుంది. వీటిలో అందించే చికిత్సకు రోజువారీ ఫీజులను ప్రభుత్వం బుధవారం ఖరారు చేసింది. రోగికి అందించే చికిత్సను అనుసరించి రోజుకు గరిష్ఠంగా రూ.10,380, కనిష్ఠంగా రూ.3,250 వరకు ఫీజు చెల్లించేలా నిర్ణయించింది. బాధితుల తరఫున ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా ఫీజులు చెల్లిస్తారని సీఈవో మల్లికార్జున తెలిపారు. ఆరోగœ్యశ్రీ నెట్‌వర్క్‌ పరిధిలో లేని ఆసుపత్రుల్లో కొవిడ్‌ బాధితులు చేరితే ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులనే తీసుకోవాలని, ఫీజుల వివరాలను నోటీసు బోర్డుల్లో ప్రకటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది.
ఫీజుల వివరాలు
* వైౖరస్‌ సోకినా...ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేని వారికి చికిత్స అందిస్తే.. రోజుకు:   రూ.3,250
* ఐసీయూలో ఉన్నా...వెంటిలేటర్‌ అవసరం లేకుంటే: రూ.5,480
* ఐసీయూతోపాటు ఎన్‌ఐవీ (నాన్‌ ఇమేజివ్‌ ఇన్వెస్టిగేషన్‌) కలిపి: రూ.5,980
* ఐసీయూలో వెంటిలేటరుతో ఉంటే:    రూ.9,580
* ఐసీయూలోనే ఉంటూ ఆరోగ్యం బాగా క్షీణించిన వారికి వెంటిలేటర్‌ అవసరం లేకుండా చికిత్స అందిస్తే: రూ.6,280.
* వెంటిలేటర్‌ సాయం అవసరమైతే:     రూ.10,380.
* ఆరోగ్యం ఇంకా క్షీణిస్తే: రూ.10,380.
* నాన్‌-ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో అదనంగా రోజుకు ప్రైవేట్‌ రూం కింద రూ.600. పీపీఈ కిట్లు, వైరస్‌ నిర్ధరణ పరీక్షలకు చెల్లించే ఫీజులు వేరుగా ఉంటాయి.

Loading video
 

 
 
 
 
 
sreek

Super Moderators
Registered:
Posts: 49,835
Reply with quote  #2 
sreek

Super Moderators
Registered:
Posts: 49,835
Reply with quote  #3 
Good step from government
Girl_Universe

Avatar / Picture

Mirapakay
Registered:
Posts: 46,257
Reply with quote  #4 
Good initiative
Irfankhan_Fan

Avatar / Picture

Mahesh-Amir-FedEx
Registered:
Posts: 13,969
Reply with quote  #5 
Nice
Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.