Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets



Jai SreeRam !!

Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment  
sreek

Super Moderators
Registered:
Posts: 49,835
Reply with quote  #1 

అద్దెకు రామోజీ ఫిలింసిటీ?

అద్దెకు రామోజీ ఫిలింసిటీ?

మీడియా టైకూన్ రామోజీరావు ఏ స్థాయి ఆర్థిక కష్టాల్లో ఉన్నారో చెప్పడానికి ఇదొక్కటి చాలు. అవును.. ఫిలింసిటీని అద్దెకు ఇవ్వడానికి రామోజీ రావు సూచనప్రాయంగా అంగీకరించారు. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కడానికి ఆయనకు ఇంతకుమించిన మార్గం కనిపించలేదు.

డిస్నీ హాట్ స్టార్ సంస్థ రామోజీ ఫిలింసిటీని మూడేళ్ల పాటు అద్దెకు తీసుకోబోతోంది. ఈ మేరకు చర్చలు కొలిక్కి వచ్చినట్టు సమాచారం. అగ్రిమెంట్ కనుక పూర్తయితే, ఫిలింసిటీపై రామోజీరావు మూడేళ్ల పాటు తన ఆధిపత్యాన్ని కోల్పోతారు.

రామోజీ గ్రూప్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉంది. మార్గదర్శి చిట్ ఫంట్స్ మినహాయిస్తే, మిగతా అన్ని సంస్థలు నష్టాల్లో నడుస్తున్నాయి. చివరికి బంగారు బాతుగుడ్డు లాంటి "ఈనాడు" కూడా ఆర్థిక సమస్యల్లో పడింది. గ్రూప్ లోని దాదాపు ప్రతి సంస్థలో ఉద్యోగులపై వేటు వేశారు రామోజీ. ఈనాడులో ఎన్ని ఉద్యోగాలు పోయాయో అందరికీ తెలిసిందే. దీంతో పాటు ఈటీవీ ఛానెల్స్, ప్రియా ఫుడ్స్, కళాంజలి, తార-సితార హోటల్స్ లాంటి సంస్థల్లో కూడా చాలామంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు.

షూటింగ్స్, పర్యాటకులు లేకపోవడంతో రామోజీ ఫిలింసిటీ సిబ్బంది కూడా దాదాపు 60శాతం మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు. ఈ క్రమంలో ఫిలింసిటీని మూడేళ్ల పాటు లీజుకు ఇవ్వడానికి రామోజీ రావు అంగీకరించినట్టు తెలుస్తోంది. డీల్ ఓకే అయితే గ్రూప్ దాదాపు 60శాతం నష్టాల నుంచి బయటపడుతుందట.

ఫిలింసిటీని తన ఒరిజినల్ కంటెంట్ షూటింగ్స్ కోసం వాడుకోవాలని డిస్నీ భావిస్తోందట. వెబ్ సిరీస్ లతో పాటు ఇతర షూటింగ్ అవసరాల కోసం ఫిలింసిటీని పూర్తిస్థాయిలో వాడుకోవాలని ఆ సంస్థ అనుకుంటోంది. అయితే అదే ఫిలింసిటీలో ఈనాడు-ఈటీవీ సంస్థలున్నాయి. రామోజీ గ్రూప్ హెడ్ ఆఫీస్ ఉంది. వీటికి తోడు ఆయన నివశించే విలాసవంతమైన భవనం (ఒక చిన్న కొండపై కట్టిన సువిశాలమైన ప్యాలెస్) కూడా ఫిలింసిటీలోనే ఉంది. వీటిపై ఎలాంటి ఒప్పందాలకు వచ్చారనేది తెలియాల్సి ఉంది.

దీంతో పాటు ఇతర సినిమాల షూటింగ్స్ కు ఫిలింసిటీని ఇస్తారా.. పర్యాటకుల్ని అనుమతిస్తారా లాంటి అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. మొత్తమ్మీద తన కలల సౌధం ఫిలింసిటీని లీజుకు ఇవ్వాలనే నిర్ణయానికి మాత్రం రామోజీరావు వచ్చినట్టు ఫిలింసిటీ వర్గాలు చెబుతున్నాయి.

 
asuraaa

Registered:
Posts: 68
Reply with quote  #2 
Neee papam pandenu nedu neee baratham padatha chudu song chala baguntundhi
sreek

Super Moderators
Registered:
Posts: 49,835
Reply with quote  #3 

అనూహ్య పరిణామం- డిస్నీ-హాట్ స్టార్ చేతికి రామోజీ ఫిల్మ్ సిటీ- మూడేళ్ల అద్దెకు..

 కరోనా నేపథ్యంలో ఓడలు బండ్లు అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పలు దిగ్గజ సంస్దల మూలాలను కరోనా సంక్షోభం కుదిపేస్తుండగా... తాజాగా హైదరాబాద్ లోనూ ఈ ప్రభావం పడింది. ఒకప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో భారీ ఓపెన్ ఫిల్మ్ స్టూడియోగా పేరు తెచ్చుకున్న రామోజీ ఫిల్మ్ సిటీ ఇప్పుడు కరోనా సంక్షోభంలో చిక్కుకుంది.
 
 
రామోజీ ఫిల్మ్ సిటీపై కరోనా దెబ్బ..
 

రామోజీ ఫిల్మ్ సిటీపై కరోనా దెబ్బ..

ఒకప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద ఫిల్మ్ సిటీగా పేరు తెచ్చుకున్న రామోజీరావు మానసపుత్రిక లాక్ డౌన్ దెబ్బకు భారీగా కుదేలైనట్లు తెలుస్తోంది. 2003లో ప్రారంభమై టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మల్లూవుడ్ మూవీ షూటింగ్ లకు కేంద్ర బిందువుగా నిలిచిన ఫిల్మ్ సిటీని ప్రధాని మోడీతో పాటు పలువురు వీఐపీలు, కేంద్రమంత్రులు, క్రీడాకారులు సందర్శించి కితాబిచ్చారు. కానీ కరోనా కారణంగా లాక్ డౌన్ ప్రారంభం అయినప్పటి నుంచి ఫిల్మ్ సిటీలో అన్ని కార్యకలాపాలు బంద్ అయ్యాయి.

నాలుగు నెలలైంది.. నాలుగు నెలలుగా బంద్...

నాలుగు నెలలైంది.. నాలుగు నెలలుగా బంద్...

దాదాపు నాలుగు నెలలుగా ఫిల్మ్ సిటీలో పనులేమీ లేకపోవటంతో ఫిల్మ్ సిటీ యాజమాన్యం అక్కడ పనిచేసే సిబ్బందిలో దాదాపు అరవై శాతం ఉద్యోగుల వరకూ నో వర్క్-నో పే విధానాన్ని అమలు చేస్తోంది. తప్పనిసరిగా ఉండాల్సిన సిబ్బందిని మాత్రమే ఉద్యోగాలకు రానిస్తున్నారు. దాదాపు నాలుగు నెలలుగా ఫిల్మ్ సిటీ కార్యకలాపాలు నిలిచిపోవటం..కరోనా ఖతం అయ్యేది ఎప్పుడో ఎవరికీ క్లారిటీ లేకపోవటంతో ఫిల్మ్ సిటీ యాజమాన్యం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు కన్పిస్తోంది.

 
 
బయట షూటింగ్స్ కు డిస్నీ నో....

బయట షూటింగ్స్ కు డిస్నీ నో....

రామోజీ ఫిల్మ్ సిటీని అద్దెకు తీసుకున్న హాట్ స్టార్-డిస్నీ సంస్థ ఇతర నిర్మాణ సంస్థల షూటింగ్ లకు అనధికారికంగా అనుమతులు నిలిపివేస్తున్నట్లు ‘రిపబ్లిక్ వరల్డ్.కామ్' తెలిపింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ఫిల్మ్ సిటీని చేతిలో పెట్టుకోవటం ద్వారా రాబోయే రోజుల్లో సొంత ఓటీటీ ఫ్లాట్ ఫామ్ తోపాటు ఇతర కంటెంట్ క్రియేట్ చేయటం ద్వారా ఇతరుల కంటే చాలా మెరుగైన పొజిషన్ లో ఉంటామని ఆ కంపెనీ భావిస్తోంది. గత ఏడాది హాట్ స్టార్ ను డిస్నీ టేకోవర్ చేసుకుంది. ఈ విలీనంతో హాట్ స్టార్ అత్యంత శక్తివంతమైన ఓటీటీ సంస్థగా అవతరించింది. ఇదిలా ఉంటే ప్రపంచంలోనే అతి పెద్ద బ్రాండ్ అయిన డిస్నీ ఫిల్మ్ సిటీని పర్యాటక పరంగా..సినిమా, షూటింగ్ ల కోసం ఉపయోగించుకోనుంది. ఈ ఒప్పందం తర్వాత ప్రాజెక్టులో మరిన్ని మార్పులు జరుగుతాయని భావిస్తున్నారు.

 
 
 
Ted_Mosby

Registered:
Posts: 87
Reply with quote  #4 
Article raasina sannasi yevadu.. 2003 lo open aindhi antaad yenti.. Early 90s nunche or before ye undhi.. visitors ki 97/98 lo open aindhemo.. Nenu 99 Summer lo choosa.. 6th holidays.. appatike.. SSR.. Iddharu mithrulu.. Maa Nannaki pelli..ilaa yenno movies lo locales naaku mind lo unde akkada theesinavi.
poven

Doctor Babu
Registered:
Posts: 4,389
Reply with quote  #5 
Disney fired or furloughed 43000 employees working in their theme parks cinema studios etc... businesses can’t or won’t pay employees without cash inflows...
Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.