Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets



Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment   Page 3 of 3      Prev   1   2   3
Ishwar

Avatar / Picture

RajaKumar
Registered:
Posts: 9,053
Reply with quote  #101 
Quote:
Originally Posted by naveen
ultimate

TFS Iswar bro

Om Namo Venkatesaaya

ఓం శ్రీ గురుభ్యోనమః
ఓం నమో వేంకటేశాయ

AjitPawan

Avatar / Picture

Registered:
Posts: 43
Reply with quote  #102 
Started THE FOUNTAINHEAD by AYN RAND....
Economics ki related best books evaraina suggest cheyagalaraa...
Nandu_123

Avatar / Picture

Na Yaldi
Registered:
Posts: 7,356
Reply with quote  #103 
The Lost River: On The Trails of Saraswati by Michel Danino...

Very well researched book and informative. It gives you a different perspective to our history and great read to know about civilization during Rigvedic time and Sapta Sindhu.
Ishwar

Avatar / Picture

RajaKumar
Registered:
Posts: 9,053
Reply with quote  #104 
త్రిపురనేని గోపీచంద్ గారి అసమర్థుని జీవయాత్ర పూర్తి చేసాను. ఈ నవలలోని  సీతారామారావు పాత్ర పితృస్వామ్య వ్యవస్థ యొక్క ఛాయలు బాగా పులుముకున్న మన సమాజంలోనిది. ఇప్పటికీ ఇలాంటి వాళ్ళు మనకు  తారసపడినా సరే  పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు వంశ గౌరవం, వంశ ప్రతిష్ఠ అంటూ చేసే ప్రతి పనిని దానికి ముడి పెట్టి ఎదుటి వాళ్లకు కూడా ఒక మనసు ఉంటుందనీ, వాళ్ళు కూడా ఒక గౌరవప్రదమైన కుటుంబం నుండే వచ్చారనీ మరిచిపోయి ప్రవర్తిస్తారు. నిజం చెప్పాలంటే ఇదొక గొప్ప మనస్తత్వ శాస్త్రవేత్త రాసాడేమోననిపిస్తుంది. గోపీచంద్ గారి రచన కూడా అంతే బావుందని చెప్పి తీరాలి. ఆయనకి కథ చెప్పడం మీదున్న పట్టు అమోఘం. 

కానీ ఈ కథ అందరికీ నచ్చదేమో అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా నేనేదో పెద్ద ఘనకార్యం చేస్తున్నాను అనే డాంబికముతో పనులు చేసే మగవాళ్లకు అంతగా రుచించని సత్యాలెన్నో చెప్పారు గోపీచంద్ గారు. ఒక రకంగా వాళ్ళ నిజ స్వరూపానికి దర్పణమే ఈ సీతారామారావు పాత్ర అని చెప్పక తప్పదు. 

భార్యను అర్ధాంగిలా కాక తనేది చెప్పినా తలూపి చేసుకుంటూ వెళ్లిపోయే ఒక యంత్రంలా భావించే మగవాళ్లకు ఈ నవలలోని ఒక ప్రకరణములో సీతారామారావు మేనమామ రాసే ఉత్తరం తప్పక చదవాల్సిందే అనిపిస్తుంది. ఎందుకంటే అది చదివాక ఏ మగవాడైనా సరే తన తల్లి అత్తవారింట్లో ఎన్ని కష్టాలు అనుభవిస్తూ అవేవీ తనకి తెలియనివ్వకుండా ఎంత గొప్పగా పెంచిందో అర్థం అవుతుంది. అది అర్థం అయ్యాక తన భార్య తేలికగా అర్థం అయిపోతుంది. 

ఈ నవల గురించి చెప్పటం మొదలు పెడితే చాలా విషయాలు చెప్పుకుంటూ వెళ్లిపోవచ్చు. కొన్ని గంటల తరబడి మాట్లాడుకోవచ్చు. సమాజంలోని ఎన్నో అవలక్షణాలను చూపిన ఇంత గొప్ప నవల గురించి తప్పకుండా భావితరాల వారికి కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. అది మన బాధ్యత.

ఈ నవల పూర్తి చెయ్యగానే త్రిపురనేని గోపీచంద్ గారు ఏమేం రచనలు చేశారో తెలుసుకున్నాను. పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అనే నవలను తెప్పించుకున్నాను. అది చదివాక దాని సమీక్షను కూడా ఇక్కడే పంచుకుంటాను.

త్రిపురనేని గోపీచంద్ గారి అన్ని రచనలూ చదివేలా నన్ను ఉద్యుక్తున్ని చేసింది ఈ 'అసమర్థుని జీవయాత్ర' నవల. మిమ్మల్ని కూడా అలానే ఆలోచింపజేస్తుంది అని అనుకుంటున్నాను.

spartan

Registered:
Posts: 502
Reply with quote  #105 
Quote:
Originally Posted by AjitPawan
Started THE FOUNTAINHEAD by AYN RAND....
Economics ki related best books evaraina suggest cheyagalaraa...


Confessions of an economic hitman
spartan

Registered:
Posts: 502
Reply with quote  #106 
Tryst to Tendulkar book baguntadi... Independent India lo major events anni cover avutayi... interesting read.

Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.