Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets


Sbdb pays Homage to Sri Akkineni NageswaraRao garu !

Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment  
yodha

Soggadu
Registered:
Posts: 6,003
Reply with quote  #1 
ఎపిలో రైతుల మోటార్లకు మీటర్లు భిగించాలని ఎపి ప్రభుత్వం నిర్ణయించింది.ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ అద్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఉచిత విద్యుత్ సరఫరాలో ఎలాంటి తేడా ఉండదని ఈ సందర్భంగా జగన్ వ్యాఖ్యానించారని , అంతేకాక అనధికారికంగా ఉన్న లక్ష కనెక్షన్ లను కూడా క్రమబద్దీకరించి కొత్త స్కీమ్ లోకి తీసుకు రావాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.గతంలో ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాల్సిందేనన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని విమర్శించడం అర్దరహితమని ఆయన అన్నారు. చంద్రబాబు తన టైమ్ లో బకాయి పెట్టి పోయిన14వేల కోట్లను కూడా తమ ప్రభుత్వం చెల్లిస్తోందని ఆయన అన్నారు.ఒక కనెక్షన్ ను కూడా తీసివేసే ప్రసక్తి లేదని, రైతులపై ఒక్క పైసా భారం ఉండబోదని ఆయన అన్నారు.సోలార్ పవర్ ను పదివేల మెగావాట్ల మేరకు ఉత్పత్తి చేసి తక్కువ దరకు విద్యుత్ ను సరఫరా చేయాలని ,దానివల్ల రైతు విద్యుత్ భారం కూడా తగ్గుతుందని ఆయన అన్నారు.ఉచిత విద్యుత్ కింద ప్రతి రైతు మీద 49 వేల రూపాయల భారం భరిస్తోందని ఆయన అన్నారు.ప్రభుత్వం రైతుల ఖాతాలలో విద్యుత్ బిల్లుల మేరకు డబ్బు వేస్తుందని, దానిని డిస్కమ్ కు బదలాయిస్తారని ఆయన అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని ఆయన అన్నారు.2021 ఏప్రిల్ నుంచి రాష్ట్రవ్యాప్తం చేస్తామని ఆయన చెప్పారు.
cinelover

Doctor Babu
Registered:
Posts: 4,045
Reply with quote  #2 
shravan_subbu

Registered:
Posts: 602
Reply with quote  #3 

why do we even need this policy change, when central government is in the process of taking power industry under its control.  Which i believe is right solution.  Power sector under states mostly run on losses as Governments run fancy schemes.  I was closely associated with APSEB between 1996 - 2001. Power industry run in losses as Government does not pay back the subsidy it gave to people.  

If its under control of state, corrupt officials in state have to listen to different ministries and wont ask for rightful payments.  Once its under central government, it can directly deduct the subsidy amount offerred by states from GST payments.  Easy and simple. 

Karuturi24

Registered:
Posts: 203
Reply with quote  #4 

1) ఇప్పటి వరకు బోరు ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగానే విద్యుత్ అందించారు మరి ఇప్పుడు కూడా అంతమందికి నగదు బదిలీ చేస్తారా లేదా ఏదైనా సాకులు చూపి కోతలు విధిస్తారా ?

2) గతంలో బిల్లు కట్టే అవసరం లేదు కాబట్టి రైతు పూర్తిగా విద్యుత్ వినియోగించుకునే వాడు మరి ఇప్పుడు కూడా వినియోగించుకున్న మొత్తానికి నగదు బదిలీ చేస్తారా లేదా ఏదైనా పరిమితి పెట్టి మిగిలిన మొత్తాన్ని రైతు నెత్తి మీద రుద్దుతారా ?

 

3) ఇప్పటి వరకు ఉన్న బోర్లకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపచేస్తారా లేదా భవిష్యత్తులో వేయబోయే బోర్లకు కూడా వర్తింపచేస్తారా ? లేదా ఏదైనా ఒక సంవత్సరాన్ని పేర్కొని దాని ముందు బోరు వేసిన వారికి లేదా దాని తరువాత వేసిన బోరు అని షరతులు విధిస్తారా ?

4) ఇతర పథకాల మాదిరి ఈ నగదు బదిలీ పథకాన్ని కొన్ని వర్గాల వారికే వర్తింపచేస్తారా లేదా బోరు ఉన్న అన్ని వర్గాల వారికి వర్తింపచేస్తారా ?

5) ఒక వ్యక్తి పేరు మీద ఎన్ని బోర్లు ఉన్న వర్తింపచేస్తారా ? లేదా ఒక వ్యక్తికి ఇన్ని బోర్లే ఉండాలి అని ఏదైనా షరతులు విధిస్తారా ?

 

6) ఎన్ని ఎకరాలు ఉన్న రైతులకైనా పథకాన్ని వర్తింపచేస్తారా లేదా కొన్ని ఎకరాలు మాత్రమే ఉండాలని పరిమితి విధిస్తారా ?

7) ఒక కుటుంబంలో ఎంత మంది పేరుమీద బోర్లు ఉన్నా అన్నిటికీ ఈ పథకాన్ని వర్తింపచేస్తారా లేదా కుటుంబం మొత్తానికి కలిపి ఇన్ని బోర్లు మాత్రమే ఉండాలి అని మెలిక పెడతారా ?

8) ఆ బోరు కింద ఏ పంట పండినా పథకాన్ని వర్తింపచేస్తారా లేదా పంటను బట్టి ఏదైనా కేటగిరీలుగా విభజిస్తారా ?

9) ఇతర ప్రభుత్వ పథకాల నుంచి సాయం పొందే వారందరికీ వర్తింపచేస్తారా లేదా కొన్ని రకాల ప్రభుత్వ పథకాలు పొందే వారిని దీనినుంచి తొలగిస్తారా ?

10) విద్యుత్ నగదు బదిలీ పథకం పొందే వారికి మిగిలిన అన్ని ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయా లేదా కొన్ని పథకాలను కత్తిరిస్తారా ?

11) ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునే వారి పేరిట బోర్లు ఉన్న వారికి వర్తింపచేస్తారా లేదా అలాంటి వారిని మినహాయింపు చేస్తారా ?

12) వచ్చే ఆదాయం ఆధారంగా ఈ పథకాన్ని వర్తింపచేస్తారా లేదా ఆదాయంతో సంబంధం లేకుండా బోరు ఉన్నవారందరికీ వర్తింపచేస్తారా ?

13) బోరు ఉంటే సరిపోతుందా లేదా దానికి ప్రభుత్వ అధికారుల నుంచి ఏదైనా గుర్తింపు పత్రం కావాలని మెలిక పెడతారా ?

14) నగదును కౌలు రైతుకు చెల్లిస్తారా లేదా యజమానికి చెల్లిస్తారా ? ఒకవేళ యజమానికి చెల్లిస్తే గతంలో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం కౌలు రైతే బిల్లులు చెల్లించాలి అంటే మరి కౌలు రైతుకు ఏర్పడిన నష్టాన్ని ఎలా పుడుస్తారు ?

15) నగదు ముందు బదిలీ చేస్తారా బిల్లులు చెల్లించిన తర్వాత బదిలీ చేస్తారా ? ముందే బదిలీ చేస్తే ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క రకంగా బిల్లు వస్తుంది మరి ఎంత మొత్తం బదిలీ చేస్తారు ? ఒకవేళ తర్వాత బదిలీ చేస్తే బిల్లులు చెల్లించిన ఎన్ని రోజులకు బదిలీ చేస్తారు ?

 

16) దీన్ని పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే నడుపుతారా లేదా విద్యుత్ సంస్థలను ప్రైవేటుకు కట్టబెట్టే ప్రయత్నం ఏదైనా చేస్తారా ?

source : Twitter (@Iloveindia_007)

 
 
OfficerOnDuty

JaiNTR
Registered:
Posts: 29,147
Reply with quote  #5 
Electricity ki nagadu badilee endo
Damnnn

Veerabhimanyu
Registered:
Posts: 8,106
Reply with quote  #6 
Just a general question
What would the increase of 2% frbm limit amount to?
And what does the cost of laying 1lakh new meters amount to?
cinelover

Doctor Babu
Registered:
Posts: 4,045
Reply with quote  #7 
Just a general question
What would the increase of 2% frbm limit amount to?
And what does the cost of laying 1lakh new meters amount to?[/QUOTE
]

2% frbm limit increase ithe around 20000cr extra appulu techukovachu
Sarada_Bullodu

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 24,177
Reply with quote  #8 
Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.