Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets



Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment  
Npower

Veerabhimanyu
Registered:
Posts: 8,302
Reply with quote  #1 

అప్పుల్లో టాప్.. అభివృద్ధిలో ప్లాప్..! ఇదీ రాష్ట్రం దుస్థితి..!

 
[ftuse45uy7srt6yi-696x398]

రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఒకటిన్నర సంవత్సరం కావొస్తుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి కొనసాగిస్తోంది అని ఆశించిన ప్రజలకి తీవ్ర నిరాశ పరిచే విషయం నిన్న కేంద్రం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్దిపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఎగుమతుల సన్నద్దత సూచీలో ఏపీ 20 స్థానానికి దిగజారడం ఆందోళన కలిగిస్తుంది. తీర ప్రాంతాలున్న రాష్ట్రాలు 8 ఉంటే, 70 శాతం ఎక్స్ పోర్ట్స్ కేవలం 5 రాష్ట్రాల నుంచే రావడం ఒకటి అయితే… తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు ఆ 5 రాష్ట్రాల్లో ఉండటం, ఏపీ ఆ లిస్టులో లేకపోవటం తీవ్ర నిరాశకు గురిచేసింది. ఏపీ అభివృద్ధి సూచిపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుందన్న ఆందోళన ప్రజల్లో కలిగిస్తుంది. ప్రతి ఏటా దేశం నుంచి జరిగే ఎగుమతులు పెరుగుతుంటే, ఏపీలో మాత్రం గత ఏడాది నుంచి ఎగుమతుల్లో కింది స్థాయికి వెళ్ళింది అని లెక్కలు చెప్తున్నాయి.

[fgjfhgjgvy]

దేశ జీడీపీలో 19.07 శాతం వాటా ఎగుమతుల ద్వారానే రావడం జరుగుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో 2013-14 లో 92,890 కోట్ల వరకు ఎగుమతులు చేశారు. 2016-17 కాలంలో 80 వేల కోట్ల ఎగుమతులు చేశారు. 2018-19లో 98,983 కోట్ల రూపాయల ఎగుమతులు చేసింది ఏపీ. 2018-19 కాలంలో ఏపీ 9వస్థానంలో ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎగుమతుల విలువ కంటే, 13 జిల్లాల రాష్ట్రంలో 6వేలకోట్ల ఎగుమతులు ఎక్కువ జరిగింది. సోషియో ఎకనామిక్ సర్వేలో ఈ వివరాలన్నీ స్పష్టంగా చెప్పారు.

అంతటి ఎగుమతుల విలువ సాధించిన రాష్ట్ర పరిస్థితి నేడు 27వ స్థానానికి పడింది. 2014-19 కాలంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రం 635అవార్డులు సాధిస్తే… ఎనర్జీ స్థాయిలో 107 జాతీయ అవార్డులు వచ్చాయి. వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతమున్నా ఏపీ ఎగుమతుల్లో వెనుకబడటం పై ఆందోళన వ్యక్తమవుతుంది. గుజరాత్ ఎగుమతుల్లో నంబర్ 1 గా ఉండటానికి అక్కడున్న పోర్టులే కారణం అనే సంగతి తెలిసిందే. మరి వీటిపై ఏపీ ఎందుకు దృష్టి పెట్టడం లేదు అనేది అర్ధం కాని పరిస్థితి నెలకొంది. అరకొర సంక్షేమ పథకాలు తప్ప రాష్ట్రములో అభివృద్ధి మీద తీసుకుంటున్న చర్యలు సూన్యం అనే చెప్పుకోవాలి. ఇదే విధానం కొనసాగితే ప్రజలు పొట్టకూటి కోసం రాష్ట్రం దాటి వెళ్ళటం తప్ప మరో గత్యంతరం లేదు అని నిపుణుల అభిప్రాయం.

mbfan

Avatar / Picture

Jackie
Registered:
Posts: 1,102
Reply with quote  #2 
ila jagan failures anni threads veyali ante db bandwidth saripodhu emo oka thread vesi dantlo veyandi sir anitini
Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.